Saturday, April 20, 2024

మెగాస్టార్@153 ప్రారంభం

  • స్వరాలు సమకూర్చనున్న తమన్
  • లూసిఫర్ రీమేక్ ప్రారంభం

మెగా అభిమానులకు చిరంజీవి సంతోషకరమైన వార్త అందించారు. మలయాళంలో విజయవంతమైన చిత్రం లూసిఫర్ కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రం ప్రారంభమైంది. చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ,ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై లూసిఫర్ రీమేక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

ఫిలింనగర్ లోని సూపర్ గుడ్ ఫిలిమ్స్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా మొదలు పెట్టారు. దర్శకుడు మాట్లాడుతూ చిరంజీవి అభిమానులు అశించే స్థాయికి తగ్గట్లుగా చిత్రీకరణ ఉంటుందని అన్నారు. లూసిఫర్ రీమేక్ అని చెబుతున్నా ఇది పూర్తి స్థాయి రీమేక్ కాదని కథని తీసుకుని చిరంజీవి మేనరిజానికి తగ్గట్లుగా మలిచి తెరకెక్కిస్తున్నట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

ఈ చిత్రానికి స్వరాలను తమన్ సమకూర్చనున్నారు. చిరంజీవి పై నాకున్న ప్రేమను తెలిపే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందంటూ తమన్ ట్వటర్ వేదికగా చిరుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. చిత్ర ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్, తమన్, మెగా బ్రదర్ నాగబాబులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles