Monday, January 30, 2023

జర్నలిజాన్ని బతికించుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలం

సదస్సులో ప్రసంగిస్తున్న ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్

  • తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సమావేశం
  • ‘మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ’ పై చర్చ
  • జర్నలిస్టులు ఐకమత్యంగా, విశ్వసనీయంగా ఉండాలని సూచన

హైదరాబాద్ : జ్ఞానం ఉన్నవాడే ప్రశ్నిస్తారనీ, ఆ ప్రశ్నంచే త్వత్వమే జర్నలిజమనీ వక్తలు అభిప్రాయపడ్డారు.సంప్రదాయ మీడియాను అర్థం చేసుకున్నంతగా ఆధునిక మీడియాను అర్థం చేసుకోలేదుగనుకే డిజిటల్ మీడియా అవతరించిందని ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. పత్రికా రంగం ప్రజాస్వామ్య మౌలిక రంగానికి సంబంధించిందని చేప్పారు. బయటివారు ఎవరో మీడియాను నియంత్రించడం కంటే జర్నలిస్టులే స్వీయనియంత్రణ పాటిస్తే వారి మాటకూ, రాతకూ విలువ పెరుగుతుందని అన్నారు. వివిధ మాద్యమాలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరూ అంతర్గతంగా చర్చించుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని శ్రీనివాస్ సలహా ఇచ్చారు.

ఐజేయూ నాయకుడు, ‘ప్రజాపక్షం’ సంపాదకుడు కె. శ్రీనివాసరెడ్డి

మీడియాను ప్రభుత్వం భయపెట్టకూడదు: శ్రీనివాసరెడ్డి

విలువలు దాటుతున్నారని ప్రభుత్వం భయపెట్టడం సరికాదన్నారు. మీడియా అంతా ఒకటేననీ, అందరికి ఒకే ఎథిక్స్ (నైతిక నియమావళి) వర్తిస్తాయని ‘ప్రజాపక్షం’  సంపాదకులూ, ఐజేయూ నాయకుడు  కె. శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే అంశం బాంబే హైకోర్టు చేప్పిన విషయాలను గుర్తు చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవన్ రెడ్డిని ఉటంకించారు. పత్రిక స్వేచ్ఛ ప్రజలను కాపాడుతుందనీ, వృత్తిని నిబద్ధతతో కొనసాగించాలీ ఆయన అన్నారు. స్వయం నియంత్రణతో జర్నలిస్టు విలువలు ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలన్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యత చాలా అవసరమనీ, విలువలకోసం, ఆత్మగౌరవం కోసం సమష్టిగా పోరాడాలనీ అన్నారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అద్వర్యంలో ’మీడియా స్వేచ్ఛ -ప్రజాస్వామ్య పరిరక్షణ‘ అనే అంశంపై రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక అధ్యక్షులు బోధనపెల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాదిక్ రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు.

తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక తీర్మానాలు

1. ఇటీవల కాలంలో జరుగుతున్న అక్రమ అరెస్టులను సమావేశం తీవ్రంగా ఖండిస్తోంది

2. సోషల్ మీడియా పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తోంది

3. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా శకం నడుస్తోంది. సోషల్ మీడియాలో పని చేసేవారికి కూడా జర్నలిస్టులందరికీ వర్తించే విధివిధానాల వర్తిస్తాయి. సాంప్రదాయ మీడియా ( ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా)కు ఉన్న నియమాలు, నిబంధనలే వీరికీ వర్తిస్తాయి

స్వయం నియంత్రణతో వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా విధానపరమైన విషయాలపై వార్తలు ప్రసారం చేయాలి. పరుష పదజాలం వాడరాదు.

4. జర్నలిస్టులపై అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలి

5. చట్టవిరుద్ధంగా రూంలపై దాడులుచేసి, అరెస్ట్ చేయడమే కాకుండా జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

ధర్మక్షేత్రం, కురుక్షేత్రం మధ్య యుద్ధం: పాశం యాదగిరి

ధర్మం క్షేత్రం.. కురుక్షేత్రం మధ్య పోరాటం జరుగుతోందని సినియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. ప్రజల తరఫున పోరాడే వారికి సంఘీభావం తెలపాలన్నారు.

సమస్యలు వస్తుంటే మౌనంగా ఉండొద్దనీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే పరిపాలకులనీ ఆయన అన్నారు. ప్రజలందరూ జర్నలిస్టులేని చేప్పారు. యూట్యూబ్ చానెల్ జర్నలిస్టులను రాత్రికి రాత్రే ఎత్తుకువడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘‘వారు పోలీసులా? టీఆర్ఎస్ కార్యకర్తలా?’’ అని ప్రశ్నించారు. జర్నలిస్టులను ఎత్తుకుపోయినవాళ్లెవరో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

నిర్బంధాల పాలన ముందుకు సాగదని సీనియర్ జర్నలిస్టు పివీ శ్రీనివాస్ అన్నారు. ప్రజల మనసులను గెలుచుకునే పాలన ఉండాలన్నారు. రాజకీయ పార్టీల చేతులకు మీడియా పోవడం దురదృష్టకరమని అవేదన వ్యక్తం చేశారు. మీడియా.. సోషల్ మీడియాపై  చర్చ జరిగితేనే ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు పడుతాయిని చేప్పారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మా గొంతు నొక్కుతున్నరని సీఎం కేసీఆర్ మోత్తుకుండనీ, తెలంగాణ వచ్చాక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని సినియర్ జర్నలిస్టు జయసారథి రెడ్డి అన్నారు. సెక్రటేరియట్.. బల్దియా.. అసెంబ్లీలోకి మీడియాను రానివ్వడం లేదనీ, స్వరాష్ట్రం కొసం ఉద్యమించిన జర్నలిస్టులను దూరం చేయ్యడం దారుణమనీ అన్నారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న బీజేపీ శాసనసభ్యుడు ఈటల రాజేందర్. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, వేదిక అధ్యక్షుడు బి.వేఫుగోపాల్ రెడ్డి, కార్యదర్శి సాదిక్, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, తదితరులు.

తెలంగాణలో స్వేచ్ఛ ఉందా?: ఈటల రాజేందర్ ప్రశ్న

‘‘తెలంగాణ లో స్వేచ్ఛ ఉందా..? ఉమ్మడి  పాలనలో స్వేచ్ఛ ఉందా..?’’ అని ప్రశ్నించారు. తెలంగాణలో పుట్టినోడు ప్రశ్నకు… ప్రశ్నించడానికి భయపడడని అన్నారు. ఉద్యమం.. చైతన్యం ద్వారా వచ్చిన నాయకుడు.. వాటిని ఎట్లా పాతరేస్తుండో తెలుస్తోందని బీజేపీ హుజూరాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యం హక్కులు.. మీడియా పై దాడి చేస్తుందో  అదే వారిని పతనం అంచుకు చేర్చుతుందని చేప్పారు. హుజూరాబాద్ లో సొంత ఓటు హక్కు ను కూడా డబ్బుతో కొన్నారనీ, ఓటర్లను ఎన్ని రకాలుగా బెదిరించవచ్చో అన్ని రకాలుగా బెదిరించారని గుర్తు చేశారు. ధర్మం.. ప్రజలు.. ఆత్మ గౌరవం గెలిచి.. కేసీఆర్ అహంకారం ఓడిపోయిందన్నారు.

మీడియాను కొనుక్కునే ప్రయత్నం.. లేదంటే బెదిరించడం ప్రజాస్వామ్యనికి మంచిదికాదన్నారు. ప్రభుత్వ పిచ్చి పనులను సహించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. పార్టీలు.. సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు.. పత్రిక స్వేచ్ఛ ప్రజల స్వేచ్ఛకు సంబంధించినది.సావుకైనా తెగిస్తం.. హక్కులను కాపాడుకుంటం. ఆకలైనా తట్టుకుంటరు.. ఆత్మ గౌరవాన్ని వదులుకోరు తెలంగాణ ప్రజలు..ఐక్యంగా ఉందాం.. చట్ట పరిధిలో పోరాడుదాం.. నా వంతు మద్దతు ఉంటుందని రాజేంద్ర హమీ ఇచ్చారు.

ప్రశ్నించే గొంతుకలు అరెస్టులను ఖండిస్తున్నామనీ, జర్నలిస్టులను నిర్భంధిస్తే అండగా ఉంటాం.. న్యాయపరమైన సాయం కూడా చేస్తామన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్ హామీ ఇచ్చారు.  కేసీఆర్ కు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదన్నారు. హామీలను అమలు చేయకుండా.. కోట్ల అవినీతి చేస్తుంటే.. ప్రశ్నించే జర్నలిస్టులను అడ్డుకోవడం సరికాదని శ్రవణ్ అన్నారు. పాలక వర్గం ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది పోయి.. మీడియా పై దాడికి పాల్పడుతున్నారు. ప్రశ్న రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఆ హక్కుకు అండగా ఉంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేవారికి మద్దతుగా ఉంటామని శ్రవణ్ అన్నారు.

మీడియాలో ప్రజాస్వామీకరణ జరుగుతోంది: కొండా విశ్వేశ్వరరెడ్డి

మీడియాలో నిజమైన డెమోక్రటజైషన్ జరుగుతోందనీ.  దాన్ని స్వాగతించాలనీ అన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి.  ప్రభుత్వ వైఫల్యాలపై  మెయిన్ మీడియా మౌనంగా ఉండటం వల్లే సోషల్ మీడియా మాట్లాడుతోందని

సీనియర్ జర్నలిస్టు పల్లె రవి కుమార్ అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా నిలబడాలన్నారు.

రాజ్యం స్పష్టంగా ఉంది.. మనమే  స్పష్టంగా లేమన్నారు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. పడిపోవడానికి సిద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉందన్నారు. జర్నలిస్టులు ధైర్యంగా ఉండలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడితే   న్యాయపరంగా కూడా అండగా ఉంటామన్నారు. న్యూట్రల్ మీడియా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అరోపించారు.

ప్రభుత్వం వల్ల, పోలీసుల వల్ల ఇబ్బందులకు గురైన జర్నలిస్టులు తమ అనుభవాలను వివరించారు.

సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles