Saturday, October 16, 2021

కర్మ ఫలం

ఎప్పుడు ఏ చెట్టు కొట్టిన పాపమో,

భూమి తల్లి గుండెలు చీల్చి

చమురు అపహరించినప్పటి శాపమో,

సాగర ప్రియుని చేర  సాగిపోతున్న నదీ కన్యకు

కాలడ్డు పెట్టిన  ప్రతిఫలమో…

స్వచ్ఛమైన ఆకాశాన్ని

నల్లని విషపు పొగలతో నింపిన

పొగరు మనిషి పై ప్రకృతి ప్రతీకారమో…

మనిషి వికృత చేష్టలు

గోడకు కొట్టిన బంతి లా

 తిరిగి వచ్చి గట్టిగ తాకాయి…

అయితే కొంచెం మెల్లగా…

దేశకాలాలు లెక్కపెట్టి దెబ్బకొట్టే

 కర్మ ఫలం గా!

ప్రయోగ శాలలో గల గల లాడిన పరీక్ష నాళికలు,

పొంగుతున్న  రంగు రంగు ద్రవాలు,

 జిగిబిగి రాతల నోటు బుక్కులు,  నల్ల కోట్లు,

పాన్స్-నే అద్దాలు, పిల్లి గడ్డాలు, 

యురేకా అరుపులు, నోబెల్ ప్రైజులు…

అన్నీ చూసి ఆమె అప్పుడప్పుడు ఫక్కున నవ్వుతుంది…

ఇదిగో,  ఇప్పటి లాగానే,

ప్రళయం అంచున నిలబెడుతుంది.

Also read: నిశ్శబ్ద గీతిక

MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles