Friday, April 19, 2024

సుప్రసిద్ధ గాయకుడు, నటుడు మాధవపెద్ది సత్యం

మాధవపెద్ది సత్యం తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.

Top 10 songs of Madhavapeddi Sathyam | Telugu Movie Audio Jukebox - YouTube

సత్యం 1922, మార్చి 11 న బాపట్ల సమీపాన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య, సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనంలో ఎనిమిదేళ్ల వయసు నుండి రంగస్థల నాటకాలలో నటించేవాడు. తెలుగు రంగస్థలంపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ మంచి నటుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యాన్ని తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు ‘అయ్యయో జేబులో డబ్బులు పోయెనే…’, మాయాబజార్ సినిమాలోని ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు’ (పాట) ఈయన మధురకంఠం నుంచి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకుడే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులందరితో పనిచేశాడు. సత్యం ఎస్వీ రంగారావు, రేలంగి వెంకటరాయయ్య పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు,మాధవపెద్ది సత్యం జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలో ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.

75ఏళ్ల్ల వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో ‘సంకురాతిరి పండగొచ్చెరో…’ పాట పాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.

ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సరము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. ఈయన కుమారుడు మాధవపెద్ది మూర్తి తన తల్లితండ్రుల స్మృత్యర్ధం తెలుగు సినీ రంగంలో కృషి చేసిన వారికి మాధవపెద్ది సత్యం అవార్డు, మాధవపెద్ది ప్రభావతి అవార్డును ప్రారంభించాడు.

(శనివారం, జనవరి 7న తెనాలిలో ప్రఖ్యాత సినీనేపథ్యగాయకుడు మాథవపెద్ది సత్యం జయంతి ఉత్సవాల సందర్భంగా. నేపథ్య గాయకురాలు ఎస్ పి. శైలజ, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ కు పురస్కారాలు ఇస్తున్నారు.)

Dr. G. Kondala Rao
Dr. G. Kondala Rao
డాక్టర్ జి. కొండలరావు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ లో పీహెచ్ డీ చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆంగ్లసాహిత్యంలో ఎంఏ చేశారు. ప్రస్తుతం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వార్తావిభాగం అధిపతిగా పని చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పరిశోధన పత్రాలు సమర్పించారు. జాతీయ, అంతర్జాతీయ వర్క్ షాప్ లలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలలో ఎక్సె పర్ట్ గా గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. 46 సంవత్సరాల మీడియా అనుభవం, ఐఐఎస్ లో సుమారు 30 సంవత్సరాలు, దేశమంతటా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles