Friday, June 9, 2023

“రచన లక్ష్యం”

శరీరానికి ఆహారం, బుద్ధికి శాస్త్ర విఙాన పఠనం, మనసుకు లలిత కళలు, ఆత్మకు సాధన ద్వారా  తృప్తి, సంతోషాలు కలుగుతాయి. ప్రాచీన కాలంలో పండితులకు, కవులకు గొప్ప గౌరవమిచ్చింది సమాజం. కాని నేడు సాహిత్యానికి ప్రాధాన్యం తగ్గి సైన్స్ కు ప్రాధాన్యం పెరిగింది. లలిత కళలు, ముఖ్యంగా అందరికి అందుబాటులో ఉన్న సాహిత్యం సామాన్యుడికి దూరమైంది. మనిషిని విలువల గురించి ఆలోచింపజేసే, పాటింపజేసే, మనసును మృదువుగా, సున్నితంగా మార్చే సాహిత్య సాన్నిహిత్యం లేకపోవడం మనిషి మానసిక వికాసంలో లోపం. మానవత్వానికి మెరుగులద్దే  మృదుత్వం, వివేచన లేకపోతే  అవతలి మనిషి కష్టాన్ని పట్టించుకోని రాక్షసుడిగా మనిషి  మారతాడనేది నిత్యం చూస్తున్న సత్యం.

మనిషికి, సాహిత్యానికి దూరం పెరగడానికి కారణాలు మన చేతిలో లేనివి చాలా ఉన్నాయి. వాటి విషయం పక్కనపెట్టి మనం ఎంత వరకు కారణమో చూద్దాం.

నాటకం, కవిత్వం, వ్యాసం, నవల, కధ లాంటి సాహిత్య ప్రక్రియల్లో ఛందోబద్ధ కవిత్వం తెలుగు పండితులకే  పరిమితమైంది. నాటకం, నవల చదివేంత సమయం, ఓపిక లేవు నేటి తరానికి. హాస్యభరిత కార్టూన్లు, సామాన్యుడి భాషలో ఉండే చిన్న కవితలు, చిన్న కధలు మాత్రం చదువుతున్నారు. అదీ  కొంతమందే. మాకు ఇష్టమైంది మా తృప్తి కోసం మేము రాస్తాం అంటే సరే. కాని మనకు సామాజిక బాధ్యత కూడా ఉంది, మనం రాసింది ఎక్కువమంది చదవాలి అనుకుంటే మాత్రం జనానికి అర్ధమయ్యే భాషలో రాసి వారి sensibilities sharpen చెయ్యవలసిన అవసరం ఉంది. రామాయణ, భారతాలు మనల్ని నాగరీకుల్ని చెయ్యకపోతే మనంకూడా అటవికుల్లాగా ఉండే వాళ్లమే పూర్వాశ్రమంలో వాల్మీకిలాగా. మనకోసం పాఠకులను పెంచుకునే ఉద్దేశ్యంతో కాకుండా  జనానికి కాస్త మేలు జరగాలన్న లక్ష్యంతో రాస్తే బాగుంటుంది.

Also read: “మహమ్మారి”

Also read: “గుడిపాటి వెంకట చలం – అధివాస్తవికత”

Also read: చర్యా పదాలు – ఒక పరిశీలన

Also read: ఆధునిక తెలుగు కవిత్వ పోకడలు

Also read: కవిత్వమంటే……

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles