Tuesday, April 23, 2024

జీవ-జీవన రహస్యాలు

విజ్ఞానశాస్త్రం కవిత్వం లాంటిదే

అయితే –

పదాలే కొంచెం భిన్నంగా ఉంటాయి.

అర్ధం కాకుండా ఉండి ,

కొంచెం భయపెడతాయి.

పదాలు చిన్నవే-

వచనాలు నిర్వచనాలు చిన్నవే

అర్ధాలే.. లోతుగా, ఎత్తుగా, పొడవుగా వివరంగా, విశాలంగా ఉంటాయి.

కవిత్వం జీవన రహస్యం అయితే

జీవ- రహస్యమే కదా విజ్ఞానం ?

సృజనాత్మకతకు రెండు శాఖలు కదా ఇవీ?

కవితా చరణాల మీద ఎంతకాలం పరిగెత్తినా  అనుభూతులే తప్ప , అనుభవాలు ఏవి?

వాస్తవంలోకి, అనుభవంలోకి,

స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిస్తే కదా జీవనాడి దొరికేది?

జీవనాడి దొరికితే కదా

కవిత్వం ఊపిరి పోసుకునేది?

గుండెను పట్టుకోవటం జ్ఞానం అయితే, గుండె చప్పుడు వినగలగడమే- కవిత్వం!!

– డాక్టర్ దేవరాజు మహారాజు

Also read: మనిషికీ, సత్యానికీ ఉన్న బంధమే సైన్సు: గ్రాంసి

Also read: పుస్తకం

Also read: ‘హిందుత్వ’ భావన ఎలా వచ్చింది?

Also read: చరిత్ర అంటే కొందరికి ఎందుకు భయం?

Also read: సైన్స్ ఫిక్షన్ మాంత్రికుడు – అసిమోవ్

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles