Saturday, April 20, 2024

లక్షల హృదయాల్లో కోనప్ప. -ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్

సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పలు అభివృద్ధి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షల మంది హృదయాల్లో స్థానం సంపాదించారని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్  తెలిపారు. శుక్రవారం (ఫిబ్రవరి 26) కౌటాల మండలంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టెట్, టీఆర్టీ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తో కలిసి ఎమ్మెల్సీ సందర్శించారు. విద్యార్థులకు శిక్షణ అందించడంద్వారా కోనేరు కోనప్ప లక్షల హృదయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో కోనప్ప  చేస్తున్న అభివృద్ధి సేవాకార్యక్రమాలతో చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుందని అన్నారు.

ఇదీ చదవండి: TET TRT శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

ఎంతో కష్టంతో కూడుకున్నప్పటికీ ఈ ప్రాంత విద్యార్థులు ఉద్యోగం సాధించాలన్న తపస్సుతో కాగజ్ నగర్, కౌటాలలో అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణ నివ్వడం గర్హనీయమని, పోటీ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్  ఆకాంక్షించారు.

పోటీ పరీక్షలలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు ఎమ్మెల్యే కోనప్ప,  ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ స్వయంగా భోజనం వడ్డించారు.

ఇదీ చదవండి : తీరనున్న లోవోల్టేజ్ కరెంటు సమస్య

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles