Friday, April 19, 2024

బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక,  రాష్ట్ర పండుగ బతుకమ్మ  ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.  తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు   ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు  బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని సిఎం తెలిపారు. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన  ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చిందన్నారు.

 బతుకమ్మను పల్లె పల్లెనా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సిఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు కుంటలు నీటితో నిండి వున్నాయని, బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని అమ్మవారిని సిఎం కేసీఆర్  ప్రార్థించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles