Thursday, April 25, 2024

31న కేసీఆర్ బిహార్ సందర్శన

ఈనెల 31 వ తారీకు న (ఎల్లుండి,బుధవారం) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బీహార్ పర్యటన చేపట్టనున్నారు. అందులో భాగంగా.. బుధవారం ఉదయం హైదరాబాదు నుండి పాట్నా కు బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో  అమరులైన 5 గురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.

సైనిక కుటుంబాలతో పాటు..ఇటీవలి, సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని  ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కెసిఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు, మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.

అమరులైన ఒక్కో సైనిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు, మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కుల ను సీఎం కేసిఆర్ అందజేయనున్నారు. సెప్టెంబర్ 3 తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్ లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సందర్భంగా..

రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణ., తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించనున్నది.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles