Friday, April 19, 2024

కుక్కమూతి పిందె బీజేపీని తరిమికొట్టాలి-కేసీఆర్ ఫైర్

  • కేంద్రం అవినీతి చిట్టా నా ద‌గ్గ‌రుంది
  • మోడీ, న‌డ్డా ఇదేనా మీ సంస్కారం?
  • అస్సాం సీఎంను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి
  • అహంకార‌మా..క‌ళ్లునెత్తినెక్కాయా
  • రాయగిరి టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం  కెసీఆర్ ఫైర్

దేశ రాజ‌కీయాల్లో మొలిచిన కుక్క మూతి పిందె బీజేపీ పార్టీ , ఇలాంటి కుక్కమూతి పిందెల్ని తరిమికొట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై  మరో సారి మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఏదో అడిగితే.. అస్సాం బీజేపీ ముఖ్య‌మంత్రి  మాట్లాడిన తీరుపై అందరూ ఆలోచించాలన్నారు. తనకే క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయనీ, త‌ల దించుకున్నంత ప‌ని అయిందనీ అవేదన వ్యక్తం చేశారు. ఒక ఎంపీని ప‌ట్టుకొని మీ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి ఇలాంటి మాట‌లు మాట్లాడొచ్చా అని అన్నారు. మ‌హాభార‌తం, రామ‌య‌ణం, భగ‌వద్గీత‌ నుంచి మ‌నం నేర్చుకున్న‌ది ఇదేనా అని ప్రశ్నించారు. ‘‘హిందు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు రాల్చుకుంటున్నారు. బీజేపీ అధ్య‌క్షుడినే నేను అడుగుతున్నా. ఇదేనా మీ సంస్కారం. వెంట‌నే అస్సాం సీఎంను బ‌ర్త‌ర‌ఫ్ చేయండి..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు.

మతపిచ్చిది బీజేపీ గవర్నమెంటు

ఈ బిజెపి మ‌త పిచ్చి ప్ర‌భుత్వం మ‌న‌కు ప‌నికిరాదన్నారు సిఎం కేసీఆర్. అన్ని రంగాల‌లో అట్ట‌ర్ ఫ్లాప్ గ‌వ‌ర్న‌మెంట్ అని చేప్పారు. ఎనిమిదేళ్ల‌లో బీజేపీ గ‌వ‌ర్న‌మెంట్ ఏ ప‌నీ చేయ‌లేదన్నారు. ‘‘ఏ రంగంలో అభివృద్ది లేదు. జీడీపీ ప‌త‌నం అయింది. ఆరోగ్య సూచీలు దెబ్బ‌తిన్నాయి. అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి. డంబాచారం త‌ప్పితే ఇంకేం లేదు’’ అన్నారు సిఎం. ‘‘మంది మీద ప‌డి ఏడ్చుడు.. మ‌త పిచ్చి లేపుడు త‌ప్పితే వీళ్లు సాధించింది ఏం లేదు. ఈ దేశానికి ప‌ట్టిన ద‌రిద్రం బీజేపీ. దేశ రాజ‌కీయాల్లో మొలిచిన కుక్క మూతి పిందె ఈ బీజేపీ పార్టీ. ఈ ద‌రిద్రాన్ని ఎంత తొంద‌ర‌గా వ‌దిలించుకుంటే ఈ దేశానికి అంత మంచి జ‌రుగుత‌ది. హెచ్చ‌రించ‌డం.. చెప్ప‌డం నా బాధ్య‌త‌. నా ధ‌ర్మం. ఈ దేశంలో ప్ర‌జా జీవితంలో ఉన్నాం కాబ‌ట్టి.. బాధ్య‌త‌లో ఉన్నాం కాబ‌ట్టి.. ధ‌ర్మం ప్ర‌జ‌ల‌కు చెప్పే బాధ్య‌త ఉన్న‌ది కాబ‌ట్టి నేను మీకు మ‌న‌వి చేస్తున్నాను. మనం కూడా చైత‌న్యంగా ముందుకు వెళ్లాలి’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

రైతులను గుర్రాలతో తొక్కించిన్రు మీరు

‘‘సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వలసలు పోయారు.  ఆగమగమైనం. కాబట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలని రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇంకా ఎన్నో సదుపాయాలు చేసుకుంటున్నం. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉచితంగా కరెంటు సరఫరా చేయరు. చేసినా 24 గంటలు ఇవ్వరు. పట్టుపట్టి మనం చేసుకుంటున్నం.. ఒకటి కాదు, అనేక రంగాల్లో చేసుకుంటున్నం. ఈ మధ్య దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం వాళ్లకు పిచ్చి ముదురుతున్నది. పిచ్చి ముదిరి పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తున్నరు. వ్యవసాయ చట్టాలు తెచ్చిన్రు. ఒక యాడాది పాటు రైతులను ఏడిపించింన్రు. ఢిల్లీ దగ్గర రైతులను అవమానపరిచారు. ఇన్‌సల్ట్‌ చేసి మాట్లాడారు. వాళ్లు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులని అవమాన పరిచారు. లాఠీచార్జీలు చేశారు. గుర్రాలతో తొక్కించారు.. చివరకు ఉత్తరప్రదేశ్‌లో ఒక మంత్రి రైతుల ధర్నా మీదికి తీసుకెళ్లి తొక్కిచ్చిన విషయం టీవీల్ల, పేపర్ల చూశారు. మళ్లీ ఐదు రాష్ట్రాల ఎన్నికల వస్తే ప్రజలకు భయపడి ఆ బిల్లులు వాపస్‌ తీసుకొని.. ప్రధాని స్వయంగా క్షమాపణ కోరుతున్న అన్నడు’’ అని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణలో 24 గంటల కరంటు ఇస్తున్నం..

‘‘ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో చాలా ఇబ్బందుల్లో ఉన్న కరెంటు.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా బాగు కాలేదు.. తెలంగాణలో బాగా కష్టపడి చేసుకున్నం. మన సొంత పైసలు పెట్టి 24 గంటలు అన్ని రంగాలకు కరెంటు ఇస్తున్నం. ఎవరో అడిగితే.. అసెంబ్లీలో నేను మా రైతులపరంగా 10వేలకోట్లయినా.. రూ. 15 వేల కోట్లయినా రాష్ట్ర ప్రభుత్వం కడుతది అని చెప్పినా. మా రైతులు ఇంకా బాగుపడాలే. ఇంకో ఐదారేళ్లు రైతుబంధు, ఫ్రీ కరెంటు, ఫ్రీగా నీళ్లు ఇస్తే అప్పులు పోయి రైతులు మంచిగై.. గ్రామాలు చల్లగుంటయ్‌. రైతు పండించే పంటతో ఒక రైతే బతుకడు కాబట్టి మేం చేసుకుంటుం.. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినా. కానీ నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం మెడమీద కత్తిపెట్టి కరెంటు సంస్కరణలు పేరు మీద.. ప్రతి బాయికి, బోరుకు, మోటరుకు మీటరు పెట్టాలే అంటున్నది.. రైతులకు డైరెక్ట్‌ సబ్సిడీ ఇయ్యద్దు అంటరు. ఇది కుదురుతదా?’’ అని సీఎం కేసీఆర్ అడిగారు.

మోడీ దోస్తుల కంపెనీల నుంచి మనం సోలార్ పవర్ కొనాల్నట

‘‘గ్రీన్‌ పవర్‌ కొనాలే. ఆయన దోస్తులు.. పెట్టుబడిదారులు ఎవరో.. 30 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ పెడుతడట.. మనం కొనాల్నట. నాగార్జున సాగర్‌, శ్రీశైలంలో ఇదే జిల్లాలో పులిచింతలకాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్‌ పవర్‌ ఉంటే.. అది ఉన్నా కూడా దాన్ని బంద్‌ పెట్టి.. ఆయన తరఫున పెట్టుబడిపెట్టే షావుకార్లు ఇచ్చేదే కొనాల్నట. దానికి అంతమైన పేరు విద్యుత్‌ సంస్కరణ. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తం.. లేకుంటే ఇయ్యం.. ఇదీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పిచ్చిక్కి రైతులతో పెట్టుకుంటున్నరు.. దీన్ని ఒప్పుకుందమా?’’ అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనం ఫ్రీగానే కరెంటు ఇవ్వాలంటూ నినదించారు. ఇంకా సీఎం స్పందిస్తూ.. ‘‘ఫ్రీగా కరెంటు ఇవ్వాలంటే.. మరి ఏం చేద్దాం.. నరేంద్ర మోదీని.. తరిమితిరిమి కొట్టాలి’’ అంటూ పిలుపునిచ్చారు. ‘‘మాకు ఇవ్వకున్నా పర్లేదు.. ఉన్నంతలో మేం ఇచ్చకుంటామంటే.. అలా ఇవ్వడానికి లేదు అంటున్నారని.. మరి కొట్లాడాలన్నా.. ఇంట్ల పండాల్నా’’ అని కేసీఆర్ అనగా.. సభకు తరలివచ్చిన అశేష జనవాహిని ‘‘కొట్లాడాలి’’ అని నినాదాలిచ్చారు.

రాహుల్ పై కుసంస్కారంగా మాట్లాడుతరా?

‘‘ఒక సీఎం స్థాయిలో.. అస్సాం ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి రాహుల్ గాంధీని అంటడు.. నువ్వు ఏ అయ్య‌కు పుట్టిన‌వో అడిగిన‌మా మేము అని అంటారా.. ఈ మాట అనొచ్చునా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. బీజేపీ సంస్కారం ఇదేనా.. మ‌న‌ హిందూ ధ‌ర్మం ఇదేనా.. మ‌న దేశం మ‌ర్యాద ఇదేనా.. ఒక నేత‌ను ప‌ట్టుకొని ఏం మాట‌లు మాట్లాడున్నారు.. ముఖ్య‌మంత్రి అలాంటివి అడుగుతారా?’’ అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. జిల్లాలోని రాయ‌గిరిలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీకి పార్ల‌మెంట్‌లో జ‌రిగిన అవ‌మానం గురించి ప్ర‌స్తావించారు. ‘‘రాహుల్ గాంధీ అనే ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు. ఆయ‌న‌తో నాకు సంబంధం లేదు. కానీ.. వాళ్ల నాయ‌న‌మ్మ‌, నాన్న ఈ దేశం కోసం చ‌నిపోయారు. వాళ్ల తాత స్వ‌తంత్ర పోరాటం చేసి అనేక సంవ‌త్స‌రాలు ప్ర‌ధాన మంత్రిగా ప‌ని చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్న‌ప్పుడు మాట్లాడుతం. చ‌ర్చ జ‌రుగుత‌ది. ఇది ప్ర‌జాస్వామ్యం. ప్ర‌జ‌లు అడుగుత‌రు. ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌జాప్ర‌తినిధులు కూడా అడుగుత‌రు. రాహుల్ గాంధీ ఏదో అడిగితే.. అస్సాం బీజేపీ ముఖ్య‌మంత్రి ఏం మాట్లాడారండి.. ద‌య‌చేసి మీరు ఆలోచించాలి..నాకే క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. త‌ల దించుకున్నంత ప‌ని అయింది. ఒక ఎంపీని ప‌ట్టుకొని మీ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి ఇలాంటి మాట‌లు మాట్లాడొచ్చా. మ‌హాభార‌తం, రామ‌య‌ణం, భగ‌వద్గీత‌ నుంచి మ‌నం నేర్చుకున్న‌ది ఇదేనా. హిందు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు రాల్చుకుంటున్నారు. బీజేపీ అధ్య‌క్షుడినే నేను అడుగుతున్నా. ఇదేనా మీ సంస్కారం. వెంట‌నే అస్సాం సీఎంను బ‌ర్త‌ర‌ఫ్ చేయండి..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు.

అన్యాయాన్ని సహించకపోవడం తెలంగాణ రక్తంలోనే ఉన్నది

‘‘మనం ఎంతకని ఓర్సుకుంటం. ఓపిక‌కు కూడా హ‌ద్దులు ఉంటాయి. ఎందుకు అంత అహంకారం? త‌మాషా చేస్తున్నారా? దేశం నాశ‌నం అయితే ప్ర‌జ‌లు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? ధ‌ర్మాన్ని, నిజాన్ని కాపాడ‌టం కోసం.. న్యాయం ప‌క్షాన నిల‌బ‌డ‌టానికి తెలంగాణ రాష్ట్రం పులిలా ఎప్పుడూ రెడీగా ఉంట‌ది. ఎవ‌రికి అన్యాయం జ‌రిగినా.. స‌హించ‌ది. అది తెలంగాణ గ‌డ్డ‌లో, తెలంగాణ రక్తంలో ఉన్న పౌరుషం. మీ అంద‌రికీ ఒక‌టే మాట మ‌న‌వి చేస్తున్నా. తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలో కూడా ప్ర‌గ‌తికాముక ప్ర‌భుత్వం ఉండాలి.. అందుకోసం మనవంతుగా కూడా పని చేయాలె’’ అని సీఎం కేసీఆర్ సభకు వచ్చిన ప్రజలను కోరారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles