Monday, November 4, 2024

యాదాద్రిలో కేసీఆర్ సమీక్ష

  • జరుగుతున్న పనుల తనిఖీ
  • అడిగి తెలుసుకున్న వివరాలు
Chief Minister KCR talking to an official at Yadadri on Monday

ముఖ్య‌మంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట.. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభం తో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ఈవో  స్వామివారి ప్రసాదంను సీఎం కు అందజేశారు. బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అర్చకులు సీఎం కెసీఆర్ కు  ఆశీర్వచనం అందజేశారు.

మంత్రులకూ, అధికారులకూ సూచనలు

అనంతరం దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించారు. కళ్యాణ కట్ట , పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన కేసీఆర్ మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సుదర్శన యాగం తలపెట్టిన యాగ స్థలాన్ని  75 ఎకరాల సువిశాల ప్రాంగణం లో నిర్వహించనున్న యాగశాల ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు. పుష్కరిణీ లో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత… స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలనూ సీఎం పరిశీలించారు.

అలయ నిర్మాణం తుది దశ పనులు, సుదర్శన యాగం నిర్వహణ కోసం ఏర్పాట్లపై  సీఎం కేసిఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మేల్యేలు సునీత మహేందర్ రెడ్డి,పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్, తదితరులు అక్కడే ఉన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles