Wednesday, September 18, 2024

111 జీవో రద్దు.. కేసీఆర్ రియలెస్టేట్ స్కెచ్ : దాసోజు శ్రవణ్

  • 1,32,600 ఏకరాల భూమి111జీవో పరిధిలో వుంది. ఇందులో లక్ష ఎకరాలు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దలే బెదిరించి కొనుకున్నారు. 111జీవో పరిధిలో వున్న భూములపై బహిరంగ చర్చ, విచారణ జరగాలి. ఈ ఎనిమిదేళ్ళలో భూములని ఎవరుకొన్నారు? ఎవరి చేతులు మారాయి? కొన్నవాళ్ళలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతమంది? వారి కొమ్ముకాసే పెద్దలు ఎంతమంది? ఇదంతా బహిరంగా విచారణ జరగాలి.
  • ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ అవసరం లేదని కేసీఆర్ చెప్పడం  గండిపేట, హిమాయత్ సాగర్ లని ఎండగట్టి అదంతా రియలెస్టేట్ వ్యాపారంగా మార్చాలనే ఆలోచనగా కనిపిస్తుంది. ఒక పక్క హరితహారం పేరుతొ చెరువులని కాపాడాలని చెబుతున్న కేసీఆర్ మరోపక్క గండిపేట, హిమాయత్ సాగర అవసరం లేదని చెప్పడం వెనుక రియలెస్టేట్ వ్యాపారం కోసం కాదా ?
  • 7951 ఫీల్డ్ అసిస్టెంట్లని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని కేసీఆర్ పెద్ద ఘన కార్యం చేసినట్లు అసెంబ్లీ లో ప్రకటించారు. హక్కుల కోసం పోరాటం చేయడం  ఫీల్డ్ అసిస్టెంట్లు చేసిన తప్పా ?  కేసీఆర్ శాడిజం వలన 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారు.  వాళ్లకు జరిగిన నష్టాన్ని ఎవరు పూరిస్తారు ? 
  • టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమ శిక్షణ, సంపద సృస్టించే తెలివి లేదని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని అభివృద్ది చేయమని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడం ఏం పాలన?
  • మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు పోటీ పడి కేసీఆర్ చెక్క భజన  కేంద్రంగా అసెంబ్లీని మార్చేయడం దుర్మార్గం. కేసీఆర్ భజన చేయాలంటే టీఆర్ఎస్ భవన్ లో చేసుకోండి. అంతేకాని ప్రజల సొమ్ముతో చట్ట సభలని భజన కేంద్రాలుగా వాడుకోవడం క్షమించరాని నేరం.

 ”ముఖ్యమంత్రి కేసీఆర్ 111 జీవో రద్దు చేస్తానని అసెంబ్లీలో ప్రకటించడం కేవలం కృత్రిమ రియలెస్టేట్ బూమ్ సృష్టించి ప్రభుత్వంలో వున్న పెద్దలు, వారి కొమ్ము కాస్తున్న బ్రోకర్లు, రియలెస్టేట్ దందాని పెంచడం కోసమే జీవో రద్దు చేస్తామని ప్రకటించారు  తప్పా అందులో ఎలాంటి చిత్తశుద్ది లేదు. సుప్రీం కోర్టులో పరిధిలో అంశాన్ని కేసీఆర్ ఎలా ఎత్తేస్తారు ? అని ప్రశ్నించారు ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. అసెంబ్లీ సమవేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు, అసెంబ్లీ సమవేశాలు జరిగిన తీరుపై గాంధీ భవన్ లో పత్రికా సమవేశం నిర్వహించారు దాసోజు. 

 ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1,32,600 ఏకరాల భూమి 111జీవో పరిధిలో వుంది. ఇందులో లక్ష ఎకరాలు టీఆర్ఎస్ పార్టీ చెందిన పెద్దలే బెదిరించి కొనుకున్నారు. ఇప్పుడు ఆ భూములకు బూమ్ ఇవ్వడానికే ముఖ్య్యమంత్రి జీవో రద్దు ప్రకటన చేశారు.  ఆ మధ్య కేసీఆర్ ప్రెస్ మీట్ లో కోకాపేట్ దగ్గర ఇరవై ఐదు కోట్లకు ఓ విల్లా అమ్ముడుపొతుందని చెప్పారు. దిన్ని అభివృద్దికి సూచి అనుకోవాలా? ఇరవై ఐదు కోట్లు విల్లా అమ్ముడుపోతుంది కాబట్టి అభివృద్ది సాధించామని అనుకోవాలా? ఇంతకంటే సన్నాసి ఆలోచన వుంటుందా? నిరుపేద కూడా ఒక ఇల్లు కొనుక్కునే విధంగా, ఎకరాభూమి కొనుక్కునే విధంగా ఒక ఆర్ధిక పరమైన వాతావరణం వుంటే అది అభివృద్ది సూచిక. అంతేకాని అడ్డగోలుగా డబ్బులు సంపాదించి కోట్లుతో విల్లాలు కొనుక్కుంటే అభివృద్ది చెందినట్లు కాదు. ముఖ్యమంత్రి రియలెస్టేట్ మైండ్ సెట్ ఈ ఉదహరణతోనే అర్ధమౌతోంది.  ఈ భూదందా మనస్తత్వంతోనే ఇవాళ 111 జీవోని రద్దు చేస్తామనే ప్రకటన కేసీఆర్ నుంచి వచ్చింది.” అని దాసోజు ఆరోపించారు.

అసెంబ్లీ లో కేసీఆర్ చాలా బాద్యత రాహిత్యంగా మాట్లాడారు.  హైదరాబాద్ పట్టణానికి నీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ అవసరం లేదని చెప్పారు. కారణం.. సమీర్ పెట్ దగ్గర కొత్త చెరువు తవ్వించి కాంట్రాక్టర్ ముడుపులు అందుకునే ప్లాను. బుర్రాబుద్ది వున్న ఎవరైనా సరే చెరువులని కాపాడుతారు.  ఎన్ని తరాలు మారినా గండిపెట్, హిమాయత్ సాగర్  వుంటుంది.  కానీ ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా చెరువులు అవసరం లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఆలోచన వెనుక రియలెస్టేట్ మైండ్ సెట్ వుందనిపిస్తోంది. గండిపేట, హిమాయత్ సాగర్ లని ఎండగట్టి అదంతా రియలెస్టేట్ వ్యాపారంగా మార్చాలనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గండిపేట హిమాయత్ సాగర్ కేసీఆర్ సొత్తుకాదు. తెలంగాణ ప్రజల వారసత్వ సంపద. ఒక పక్క హరితహారం పేరుతొ చెరువులని కాపాడాలని చెబుతున్న కేసీఆర్ మరోపక్క గండిపేట హిమాయత్ సాగర అవసరం లేదని చెప్పడం వెనుక రియలెస్టేట్ వ్యాపారం  వుంది. దినిపై బహిరంగా విచారణ జరగాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

కాగ్ రిపోర్ట్ చూస్తే కేసీఆర్ ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో అర్ధమౌతుంది.  టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమ శిక్షణ, సంపద సృస్టించే తెలివి లేదని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. సంపద సృస్టించాలంటే భూములు అమ్మాలి, వీధికో వైన్ షాప్ పెట్టాలి, ప్రజలని అప్పులు పాలు చెయ్యాలనే ఆలోచన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వుందని కాగ్ మొట్టికాయలు వేసింది.  తెచ్చిన అప్పులో 75శాతం కేవలం వడ్డీలు కట్టడానికే సరిపొతుందని కాగ్ వెల్లడించింది.  కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారు ? రాష్ట్రాన్ని అభివృద్ది చేయమని ప్రజలకు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడం ఏం పాలన ? విద్య , వైద్యానికి దేశంలో అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. విద్య, వైద్యమే అందించకుంటే మిగతా రంగాల పరిస్థితి  అర్ధం చేసుకోవచ్చు” అని వివరించారు  దాసోజు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles