Thursday, April 18, 2024

క్రికెట్ యాంకర్ కు యార్కర్ల కింగ్ మూడుముళ్లు

  • జస్ ప్రీత్ బుమ్రా జీవితభాగస్వామిగా సంజన
  • ట్విట్టర్ ద్వారా బయటపెట్టిన భారత బౌలర్

భారత పేస్ బౌలర్, యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైనట్లు ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు. క్రికెట్ యాంకర్ సంజన గణేశన్ తో ఈవారంలోనే బుమ్రా వివాహమంటూ ఓవైపు ప్రచారం జరుగుతుంటే తన బౌలింగ్ లోని వేగంతో సమానమైన వేగంతో బుమ్రా ఏకంగా పెళ్లి పోటోనే అభిమానుల ముందుంచి సంచలనం సృష్టించాడు.

27 సంవత్సరాల బుమ్రా తనకంటే ఏడాది పెద్దదైన సంజనను ప్రేమించి పెళ్లాడినట్లు తెలిపాడు. ఇంగ్లండ్ తో ముగిసిన నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టులతో పాటు ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు వ్యక్తిగత కారణాలతో బుమ్రా దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే బుమ్రా మాత్రం వివాహం కోసమే సెలవు తీసుకొన్నట్లు సమాచారం బయటకు వచ్చింది.

Also Read: విజయ్ హజారే ట్రోఫీ విజేత ముంబై

బుమ్రా కాబోయే భార్య మళయాళీ నటి అనుపమ పరమేశ్వరన్ అంటూ కూడా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే కొద్దిరోజుల క్రితమే అనుపమ కాదు సంజన అంటూ తాజాగా మరోవార్త బయటకు వచ్చింది.గోవాలో కేవలం తమ కుటుంబసభ్యుల సమక్షంలోనే బుమ్రా- సంజన ఒక్కటి కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. బుమ్రా పెళ్లివార్త కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయంలో యార్కర్ స్పీడుతో బుమ్రా- సంజనల పెళ్లి ఫోటోనే వచ్చిపడింది.

ఏది ఏమైనా క్రికెటర్లనే ఇంటర్వ్యూలు చేసే ఓ యాంకరమ్మ ఓ అంతర్జాతీయ క్రికెటర్ నే తన ప్రేమతో క్లీన్ బౌల్డ్ చేసి జీవితభాగస్వామిని చేసుకోడం చూస్తే ఔరా!అమ్మక చెల్లా అనుకోక తప్పదు మరి.!

Also Read: లెజెండ్స్ సిరీస్ లో మాస్టర్ క్లాస్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles