Tuesday, April 23, 2024

జనవరి 10… ధూళిపాళ జయంతి

ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత.
పుట్టింది, పెరిగింది తెలుగు రాష్ట్రంలో అయినా, ఆంజనేయులు కేవలం ఇంగ్లీషులోనే రాసి గొప్ప జర్నలిస్టుగా ఖ్యాతి చెందారు. డి.ఎ.అని పాఠకులకు పరిచితులు.

1924 జనవరి 10న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఎలవర్రులో పుట్టి, ముందు నుండే జర్నలిస్టు జీవితాన్ని ఎంపిక చేసుకున్న ఆంజనేయులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా, సమాచార శాఖలో జర్నలిస్టుగా, ఆకాశ వాణిలో వాణి పత్రికా సంపాదకులుగా, హిందూ పత్రిక సంపాదక బృందం బాధ్యులుగా, పేరెన్నిక గన్నారు. కోటంరాజు రామారావు నడిపిన “ఇండియన్ రిపబ్లిక్” లో తొలుత జర్నలిజానికి ఆయన శ్రీకారం చుట్టారు.మొదట ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకవర్గంలో 1948లో చేరి 1953లో ది హిందూ పత్రికలో చేరి అనుభవం సంపాదించిన తర్వాత 1959 లో ఆకాశవాణి వారి వాణి పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించారు.

ఇది చదవండి: బ్రిటిష్ ఇండియాలో మెకాలే మెగా సేవలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగరీత్యా ఆంజనేయులు ఢిల్లీ, హైదరాబాద్, మద్రాసులో వుంటూ సమాచార శాఖలో జర్నలిస్టుగా వృత్తిధర్మం నిర్వర్తించారు. ఉద్యోగంలో వున్నా వివిధ పత్రికలకు రాస్తూ ఆంజనేయులు మంచి పేరు తెచ్చు కున్నారు. అంతకుమించి, ఎన్నో రచనలు ప్రచురించారు. ఆయన రాసిన పత్రికలు క్వెష్ట్, ఇండియన్ రివ్యూ,థాట్, ఇండియన్ లిటరేచర్, త్రివేణి, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ రైటింగ్ టుడే పేర్కొనదగినవి.

తెలుగు పత్రికలకు ఇంగ్లీషులో రాసి పంపగా, అనువదించి వేసుకునేవారు. స్వతంత్ర టైమ్స్, డక్కన్ హెరాల్డ్, న్యూస్ టుడే, ఇండియన్ బుక్ క్రానికల్ పత్రికలు కూడా ఆంజనేయులు వ్యాసాలు ప్రచురించాయి. భవాన్స్ జర్నల్ లో ఎన్నో విలువైన వ్యాసాలు ఆంజనేయులు రాశారు. వృత్తిచేస్తూనే అనేక సెమినార్లకు, చక్కని వ్యాసాలు రాయడం ఆంజనేయుల జర్నలిస్ట్ కృషిలో భాగం అయింది. దీనిఫలితంగా జీవితచరిత్ర, కళ గురించేగాక, నెహ్రూ, రాధాకృష్ణన్, అంబేద్కర్, నిరాద్ చౌదరి మొదలైనవారిపై లోతైన పరిశీలనా వ్యాసాలు రాశారు. ​తెలుగు సాహిత్యాన్ని, రచయితల్ని తెలుగేతరులకు అందించడం ఆయన విశిష్టత. ఇందులో భాగంగా గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ రాయగా, కలకత్తా రైటర్స్ వర్క్ షాప్ వారు వెలువరించారు.ఆయన ఏది రాసినా, చెప్పినా స్పష్టంగా, మృదువుగా, మర్యాదగా వుండేది. సున్నిత హాస్యం,విమర్శ ఆయన రచనల్లో కనిపించేది.

ఇది చదవండి: స్వరానుకరణ కళల సవ్యసాచి నేరెళ్ల వేణుమాధవ్

వృత్తిరీత్యానూ, వ్యక్తి దృష్ట్యా ఆంజనేయులుగారికి ఎందరో సన్నిహితులయ్యారు. వారిలో నార్ల వెంకటేశ్వరరావు, సంజీవదేవ్, బి.ఎస్.ఆర్.కృష్ణ, కె.శ్రీనివాస అయ్యంగార్, వామనరావు, పట్టాభిరాం, ఎ.ఆర్.బాజీ, భావరాజు నరసింహారావు ప్రభృతులెందరో వున్నారు. నార్ల వెంకటేశ్వరరావు తన ఇంగ్లీషు రచనల్ని ముందుగా ఆంజనేయులు పరిశీలించిన తరువాత ప్రచురించేవారు.

విశ్వనాథ సత్యనారాయణ, గోపీచంద్, బైరాగి, పాలగుమ్మి పద్మరాజు, శ్రీశ్రీ, సి. నారాయణరెడ్ది, దాశరధి, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలైన వారిని తెలుగేతరులకు తన రచనల ద్వారా పరిచయం చేసిన గొప్పతనం ఆయనదే. పత్రికలకు ఇంగ్లీషులో రాసి పంపగా, అనువదించి వేసుకునేవారు. స్వతంత్ర టైమ్స్, డక్కన్ హెరాల్డ్, న్యూస్ టుడే, ఇండియన్ బుక్ క్రానికల్ పత్రికలు కూడా ఆంజనేయులు వ్యాసాలు ప్రచురించాయి. భవాన్స్ జర్నల్లో ఎన్నో విలువైన వ్యాసాలు ఆంజనేయులు రాశారు. వృత్తిచేస్తూనే అనేక సెమినార్లకు, చక్కని వ్యాసాలు రాయడం ఆంజనేయుల జర్నలిస్ట్ కృషిలో భాగం అయింది. దీనిఫలితంగా జీవితచరిత్ర, కళ గురించేగాక, నెహ్రూ, రాధాకృష్ణన్, అంబేద్కర్, నిరాద్ చౌదరి మొదలైనవారిపై లోతైన పరిశీలనా వ్యాసాలు రాశారు. ద్వివేదుల విశాలాక్షి రచన “గ్రహణం విడిచింది” ఇంగ్లీషులోకి అనువదించారు.

ఆంజనేయులు రచనలను… కట్టమంచి రామలింగారెడ్డి,సాహిత్య అకాడమీ, కందుకూరి వీరేశలింగం, కేంద్ర ప్రచురణ సంస్థ ప్రచురించాయి. ఆయన రష్యా, యూరప్ దేశాలు పర్యటన అనుభవాలను ‘విండో టు ది వెస్ట్’ అని పుస్తకంగా ప్రచురించారు. ఆంజనేయులు రిటైర్ అయిన తరువాత మద్రాసులో స్థిరపడి, హిందూలో “బిట్వీన్ యు అండ్ మి” అనే శీర్షిక 10 సంవత్సరాలు (1981-91) నిర్వహించారు.మద్రాసు ప్రెస్ క్లబ్ లో 30 సంవత్సరాలు అధ్యక్షులుగా వున్నారు. సాహిత్య విమర్శ, సాంఘిక సంస్కరణలపై కూడా రచనలు చేశారు.ఆంజనేయులు సెక్యులర్ జీవితం గడిపారు. కుమార్తె వివాహం రిజిస్టర్ చేయించి,కన్యాదాన పద్ధతి నిరసించారు. సంగీతం, సంస్కృతం, సాహిత్యం అంటే ప్రత్యేకాభిమానం. స్వంత గ్రంథాలయం దేశంలో అతి పెద్దదైన వ్యక్తిగత గ్రంథాలయాలలో ఒకటి.

తెలుగువారు గర్వించదగిన ఇంగ్లీషు జర్నలిస్టు తన 75వ ఏట 1998 సంవత్సరం డిసెంబరు 27 తేదీన చెన్నైలో తుది శ్వాస వదిలారు.

ఇది చదవండి: చమత్కారం… ‘పింగళీయం’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles