Wednesday, November 6, 2024

రేవంత్ పై జగ్గారెడ్డి ధ్వజం

  • ఈ పీసీసీ చీఫ్ మాకొద్దు:  సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ
  • అందరినీ కలుపుకుని పోయేవారిని చీఫ్ గా నియమించాలని విజ్ఞప్తి
  • లేకపోతే రేవంత్ ను నియంత్రించాలని వినతి
  • రేవంత్ తో వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టీకరణf

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని మార్చాలంటూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీలో అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరారు. లేదంటే పార్టీ మార్గదర్శనంలో నడిచేలా రేవంత్ ను నియంత్రించాలని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ వైఖరి కంటే సొంత ఇమేజ్ కోసమే పనిచేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. స్టార్ లీడర్ గా ఎదగాలనుకుంటున్న రేవంత్ రెడ్డి తనకు నచ్చిన నిర్ణయాలే తీసుకుంటున్నారని, సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దించలేదని అన్నారు. తన వైఖరి మార్చుకోవాలని చెప్పేందుకు ఫోన్ చేస్తే రేవంత్ స్పందించడంలేదని ఆరోపించారు. తెలంగాణలో పార్టీ నడుస్తున్న తీరు చూస్తుంటే సోనియా, రాహుల్ ల కాంగ్రెస్ పార్టీలా లేదని, ఓ కార్పొరేట్ ఆఫీసులా నడుస్తోందని విమర్శించారు. గ్రామస్థాయికి వెళ్లి పనిచేసే ఉద్దేశం రేవంత్ కు లేదని, ఇది పార్టీకి ప్రమాదం అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని జగ్గారెడ్డి వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడం కోసమే ఈ లేఖ రాస్తున్నానని  స్పష్టం చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles