Thursday, February 2, 2023

కులనిర్మూలన – తులనాత్మక పరిశీలన

కులనిర్మూలన – తులనాత్మక పరిశీలన

రావులపాలెంలో ‘కులనిర్మూలన’పై చర్చ

మే 15, ఆదివారం కోనసీమ జిల్లా , రావులపాలెం ఏకలవ్య శిక్షణ కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విశిష్ట రచన “కులనిర్మూలన’ 86 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సమాలోచన.

ఒక ప్రయోగం!

భిన్న అభిప్రాయాలు గల వ్యక్తులు, విభిన్న సంస్థలకి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు అంతా ఒక్కచోటికి చేరి కులనిర్మూలన సాధ్యా సాధ్యాలు, సాధకబాధకాల గురించి కూలంకషంగా చర్చించుకోవడం మంచి ప్రయత్నం !

డా. చెలికాని స్టాలిన్ (చెలికాని రామారావు స్మారక సమితి), డా. చల్లా రవికుమార్ (సంగమం), డా. మోహన ప్రసన్నవా రువిజ్ఞాన వేదిక) , డా. చిలుకోటి కూర్మయ్య (బహుజన మేధావి, రచయిత), మలసాని శ్రీనివాస్ (కులనిర్మూలన వాది), కట్టా కృష్ణారావు (జాహ్నవి సాంస్కృతిక వేదిక), ఆకుమర్తి రవి (మానవహక్కుల వేదిక), ముత్యాల శ్రీనివాసరావు (పెరియార్ ఆలోచనా వేదిక)

ఇంకా, కె.వి.వి. సత్యనారాయణ (జనవిజ్ఞాన వేదిక), మాకా రాజేంద్రన్ (మార్పు స్వచ్ఛంద సంస్థ), కరుణాకర్ (అంబేద్కరిస్ట్), పి. యస్. రవికాంత్ (సహవాసి స్వాభిమాన వేదిక), నక్కా డేవిడ్ రాజు (ఉపాధ్యాయ నాయకులు), పెద్దింశెట్టి లెనిన్బాబు (ప్రత్యామ్నాయ పాత్రికేయ వేదిక), రవి (అఖిలభారత విద్యార్థి సంఘం), పోతుల శేఖర్నాథ్ (భూపతి నారాయణ మూర్తి స్మారక వేదిక),

వీరే కాకుండా, నల్లా సూర్య ప్రకాష్ ( ఆంధ్రప్రదేశ్ దళిత్ వాచ్), బి. శరత్ బాబు ( అంబేద్కరిస్ట్), ఏసురాజు (సామాజిక కార్యకర్త), మొదలైన వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ సమా లోచన లో ఆసక్తి గా పాల్గోవడం  నిజంగా ఒక నిర్మాణాత్మక వేదికకి ఆలంబన!

భిన్నభావాల వ్యక్తీకరణ

కులనిర్మూలన కి సంబంధించి సీరియస్ చర్చలు సాగిన ఈ సమాలోచన లో విధానపరమైన కార్యాచరణ కోసం భిన్న భావాలు వ్యక్తం అయ్యాయ్. ఐతే, కులనిర్మూలన కోసం ఎవరి పరిధిలో వాళ్ళు ముందుకు వచ్చి ఈ విధమైన సమాలోచన కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం ప్రధానమనే భావన అంతా వ్యక్తం చేశారు!

డా. బి. ఆర్. అంబేద్కర్ మహత్తర రచన కులనిర్మూలన లోని అనేక అంశాలతో పాటు మార్క్సిజం, కమ్యూనిస్టు పార్టీల ధోరణులు, భారతీయ సంస్కృతి లోని సంక్లిష్టమైన అంశాలు, యువత పరాధీనత, సాంఘిక పరాయీకరణ మొదలైనవన్నీ చర్చల్లోనికి వచ్చాయ్ !

నన్ను ఆశ్చర్యపరిచింది పాల్గొన్న వారి నిబద్దత. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఒక్కరు కూడా మధ్యలో వెళ్ళిపోకుండా చర్చల్లో పాల్గోవడం. ఎంతమంది తో మొదలు పెట్టామో అంతే మంది తో సమాలోచన కార్యక్రమం ముగియడం !

బాబాసాహెబ్ అంబేడ్కర్ రచన ‘కుల నిర్మూలన’పైన రావులపాలెంలో చర్చిస్తున్న సామాజిక కార్యకర్తలు, మేధావులు.

రాజ్యాంగ ప్రవేశిక సమిష్టి పఠనంతో ప్రత్యామ్నాయ దృక్పథంతో జరిగిన ఈ కార్యక్రమం,భిన్న భావాలు గల వ్యక్తులు ప్రజాస్వామిక పద్దతిలో కులనిర్మూలన అనే అంశానికి సంబంధించీ జరిపిన విశ్లేషణాత్మక చర్చలు వ్యక్తిగతంగా నన్ను అబ్బురపరిచాయ్. డా. బి. ఆర్. అంబేద్కర్ కులనిర్మూలన పుస్తకం 86 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఏకైక చర్చా కార్యక్రమం ఇదేనని కచ్చితంగా చెప్పగలను!

భవిష్యత్ కార్యాచరణ

ఈ కార్యక్రమం మరింత స్పష్టతని సంతరిం చుకుని , ఇంకా బలోపేతం కావాలని కులనిర్మూలనే ధ్యేయంగా విభిన్న రకమైన ప్రజాతంత్ర ఉద్యమ రూపాలలో ముందుకి సాగాలనీ, అందుకోసం ముందుకొచ్చి వారివారి విలువైన వనరుల్ని, సమయాన్ని వెచ్చించిన అందరకీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు !

(భవిష్యత్ కార్యాచరణ గురించి పూర్తిగా ఇంకా చర్చించాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఈ సమా లోచన వంటిదే దగ్గర జిల్లాల్లోని ఇతరేతర ప్రాంతాలలో జరపాలని మిత్రులు ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ఇతర కార్యాచరణ ప్రణాళిక కి సంబంధించి సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.)

ఇట్లు

గౌరవ్

కులనిర్మూలనా సమాఖ్య

Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles