Friday, March 29, 2024

ప్రతిజ్ఞా పాలనలో లక్ష్యాన్ని ముద్దాడిన ఉద్ధం సింగ్

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన వారెందరో…అయితే అమర వీరుడు ఉద్దం సింగ్ ఆత్మార్పణం ఒక ప్రత్యేకం. కళ్ళముందే అగణిత ప్రాణాలను కిరాతకంగా తుపాకీ గుళ్ళకు బలి చేసిన శ్వేతజాతి అధికారిని హతమార్చి పగ తీర్చుకున్న సందర్భం. దేశ చరిత్రలో  చెరిగి పోలేని దేశభక్తికి పరాకాష్టగా నిలిచిన ముఖ్య ఘట్టం.  జలియన్ వాలా బాగ్ మారణకాండలో ప్రాణాలతో బయటపడిన యువకుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, పగ తీర్చకోవడానికి ఏళ్ళ తరబడి నిరీక్షించి, లక్ష్య సాధనలో దేశాన్ని వదిలి, విదేశానికి శ్రమకోర్చి వెళ్ళి, సమయం కోసం వేచి ఉండి, నర రూప రాక్షసుడైన డయ్యర్ ను హత మార్చి, ఉరి తాడును ముద్దాడిన దేశం గర్వించదగ్గ అమరుడు ఉద్దమ్ సింగ్ సాహసోపేత నేపద్యం అనన్య సామాన్యం, అపూర్వం, అసమానం. ఈ చారిత్రక నేపథ్యం గురించి తెలుసు కోవాలంటే 101 ఏళ్లు వెనకకు వెళ్లాల్సిందే.

పంజాబ్, బెంగాల్ లో నానాటికీ పెచ్చరిల్లుతున్న విప్లవోద్యమం, భారత ప్రజల్లో నానాటికీ రగులుతున్న అసంతృప్తి (ముఖ్యంగా బాంబే మిల్ వర్కర్స్ లో), మొదలైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తియైన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్ కమిటీ అంటారు.

రౌలట్ కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటీష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్ లకు విశేష అధికారాలని కట్టబెట్టారు. ప్రెస్ నోళ్ళను కట్టేయడానికీ, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, తిరుగుబాటు దారునిగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం పై దేశంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. 1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లోగల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ తోట లో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశమైనారు.

అది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం, ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం, అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం క్రింద సత్యపాల్,, సైఫుద్ధీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలా బాగ్ (పార్కు) అన్ని ప్రక్కలా ఇండ్లతోను, పెద్ద భవనాలతోను చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలావాటికి తాళాలు వేసిఉన్నాయి.

కాల్పుల కారణంగా వందలమంది మరణించారు. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379(337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.  అక్కడ స్మారక చిహ్నంపైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడినవారని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు. పంజాబ్  అమృత్ సర్ లోని 1919 ఏప్రిల్ 13 న జలియన్ వాలా భాగ్ లో శాంతియుతంగా వేల మంది సామన్య పౌరులు సమావేశం అయి ఉండగా పోలీసులతో చుట్టుముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి వేల మంది మరణానికి కారణం అయ్యాడు జనరల్ డైయర్. 

షేర్ సింగ్ (ఉధం సింగ్) 1899 డిసెంబర్ 26 న పంజాబ్ లో సంగ్రూర్ జిల్లా సునం అనే గ్రామంలో కాంబోజి సిక్ కుటుంబంలో జన్మించారు. తండ్రి తెహల్ సింగ్ పొరుగు గ్రామమైన ఉపాల్ లో జమ్ము రైల్వే క్రాసింగ్ కాపలాదారుగా జీవనం సాగించేవారు. ఉదం సింగ్ తల్లి 1901లో తండ్రి 1లో చనిపొయారు. షేర్ సింగ్ (ఉధం సింగ్ ) వారి తల్లి తండ్రులు చనిపోయాక అన్న ముక్తా సింగ్ తో కలిసి అమృత్ సర్ లో సెంట్రల్ ఖల్సా అనాథ ఆశ్రమంలో చేరారు. అక్కడ సిక్కులకి మతపరమైన దీక్ష చేసి అక్కడ వారి చేత ఉదం సింగ్ అనే పేరుని స్వీకరించారు మెట్రిక్యులేషన్ చదువు 1918లో పూర్తి చేసి 1919లో ఆ అనాథ ఆశ్రమం నుండి బయటకి వచ్చాడు.

జలియాన్ వాలా బాగ్ సంఘటనలో యువకుడైన సింగ్ కూడా ఉన్నాడు. అమానుష దాడి తన కళ్ళ ముందే జరగడంతో హత్యాకాండకు సూత్రధారి అయిన డయ్యర్ ను జెనరల్ మైకెల్ ఓ డయ్యర్ ను హతమార్చడానికి ప్రతీకారాన్ని ప్రతిన బూనాడు. భగత్ సింగ్ విప్లవ భావాలకి ఆకర్షితుడై 1927 న భగత్ సింగ్ ఆదేశాల మేరకు విదేశాలనిండి తుపాకులు తెస్తు పొలీసులకు దొరికి 1931 వరకు జైలు జీవితం గడిపాడు. విప్లవ వీరుడు భగత్ సింగ్ ను ఉరి తీయడం సింగ్ ను కలచి వేసింది.జైలు నుండి  విడుదల అయిన తరువాత చదువు పేరుతో పేరు మార్చుకుని,  పోలీసుల నిఘా నుండి తప్పించుకుని కాశ్మీర్, జర్మనీ మీదగా లండన్ చేరాడు.

 డయ్యర్ ని హత్య చేయడానికి పగబట్టి 9 సంవత్సరాలు ఎదురు చూసి 21 సంవత్సరాల తరువాత మార్చ్ 1940 మార్చి 13 న లండన్ కాక్స్ టన్ హాల్ లో డయ్యర్ ని అందరు చూస్తుండగానే తుపాకీతో కాల్చి హత్య చేసి ప్రతీకారం తీర్చుకుని పోలీసులకి స్వచ్చందంగా పట్టుబడి తను చంపిన కారణాన్ని నిర్భయంగా చెప్పాడు. దీంతో జూన్ 4, 1940 న, ఓల్డ్ బెయిలీలోని సెంట్రల్ క్రిమినల్ కోర్టులో, జస్టిస్ అట్కిన్సన్ , అతను మరణశిక్ష విధించాడు జూలై 31, 1940 న, ఉధమ్ సింగ్ ను లండన్ లోని పెంటన్ విల్లే జైలులో ఉరి తీసారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles