Thursday, December 8, 2022

పంద్ర + ఆగస్టు = పంద్రాగస్టు

1. భారతదేశానికి స్వాతంత్రం అర్దరాత్రి, చీకటిలో వచ్చింది. ఇదిఒక శక్తి, పసలేనికొందరి మాటలు  

2. భారతదేశం” విదేశీయులవెట్టి”  నుండివిముక్తిఅయ్యిసరిగ్గా 74 దాటి 75 ఏళ్ళల్లోకి ప్రవేశిస్తున్న దేశంమనది. కొందరివాదన … విదేశీయుల వెట్టికిందనే బ్రతికి ఉంటే దేశం ముందుకు వెళ్ళేది అనే వాదన చేసేవాళ్ళు నేటికీ ఉన్నారు. ఇందులో ఎలాంటి అనుమానించే అవసరం లేదు. 

3. భారతదేశం విదేశీయుల వెట్టినుండి బంధవిముక్తి జరిగినప్పటికినీ “స్వదేశీయవెట్టి”లో / వెట్టినుండి 74 ఏళ్ళ నుండి విముక్తం కాలేదు అని మరి కొందరి వాదనా ఉంది. దీన్నికూడా అనుమానించవలసిన సమయం కాదు.

Also read: తెలంగాణ రాష్ట్రం – రాజకీయ సంక్షోభం? 

4. ఇంకా 74 ఏళ్ళనుండీ, ఇంకాఇప్పటికినీ భారతదేశంమతం – కులం ప్రభావంతోనే నడుస్తుంది, ప్రజల బ్రతుకులు శారీరకంగా లేకున్నామానసికంగా 139 కోట్లప్రజలు “వెట్టి” లోనే జీవితాలనుసాగిస్తున్నారు / బ్రతుకుతున్నారు. అందులోనే / వాటితోనే ముగిస్తున్నారు అని  ఇంకొందరి వాదనకూడా ఉంది. దీన్ని అంగీకరించలేని విషయం మాత్రం కాదు. 

నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలి

పైనాలుగింటి పై ఓ దృష్టి వేస్తే, భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అనేది ముఖ్యం, ఎప్పుడొచ్చింది అనేదికాదు, ఇకపోతే ..వెట్టి చేయటం అంటే ఆలోచించే మెదడును కలిగి ఉన్నవారిని “మనుషులు” గా  గుర్తింపు లేకుండా “నోరులేని జంతువులమాదిరి” తలఊపేస్తూ మెదడును, మనసును, కళ్ళను, కాళ్ళను, చెవులను, చేతులను ఉపయోగించకుండా,  చెప్పిన పని చేసి కడుపును నింపుకోకుండా నేబ్రతికేయటం. ఈ విధంగా 1947,  పంద్రాగస్టుకుముందు 34 కోట్ల ప్రజలు జీవించారు. పంద్రాగస్టు, 1947 నాడు ఈ ప్రజలు స్వాతంత్ర పోరాటంతో విముక్తం అయ్యారు. కానీ, ‘వెట్టి భావజాలాన్ని’ వారసత్వంగా మోసుకొచ్చారు. దీన్ని 1947, పంద్రాగస్టు తరువాత జరిగిన పరిణామాలకు ముడి పెట్టడం  దేశ శ్రేయస్సుకు, ప్రజలకు ఎంతవరకు ఉపయోగం?

Also read: 124-ఏ ఐపీసీ పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం

స్వాతంత్య్రంసంపాయించుకున్న 34 కోట్లప్రజలు వారసత్వంగా మోసుకొచ్చిన దాన్నివదిలి వేసేటందుకే 26-11-1949 లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. 26-01-1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రం సంపాయించుకున్న 34 కోట్లప్రజలు నేడు 139 కోట్లకు జనాభాను పెంచారు. జనాభాతోను, జనాభాకు ఇవ్వవలసిన “రాజ్యాంగా”నికి బదులుగా” మతం – కులం, హింస, వనరుల దోపిడీని, బుద్ధిమాంద్యాన్ని, ద్వేషాన్ని ఇచ్చి పోషించారు. ఈ పోషణ అనేది ఫలానా వర్గంవారు, ఫలానా కులం వారు, ఫలానా మతం వారు చేసారు అని చెప్పటం కుదరదు. ఎందుకంటె  స్వాతంత్య్ర పోరాటంలో అందరూ పాలుగోన్నారు, వెట్టి అనే బంధవిముక్తం చేసిన వారిలో అన్ని కులాల వారు, అన్నిమతాలవారు, అన్ని వర్గాలవారున్నారు.ఆ తరువాత కూడా భారత రాజ్యాంగ నిర్మాణంలోనూ అందరూ ఉన్నారు. భారత దేశాన్ని పాలించిన పాలకులలోనూ అందరూ ఉన్నారు. ఫలానా కులం – మతం – వర్గం వారు లేరు అని విడదీసి చూసే స్థితిలేదు. 

Also read: బేగరి నాగరాజు (24) హత్య దేని పైన దాడి? అంటరానితనమా? వివక్షా? అగౌరవమా? పరువు హత్యా? మత హత్యా? రాజ్యాంగంపైన దాడా?

దారి చూపిన భారత రాజ్యాంగం

స్వతంత్ర భారతదేశం సర్వ సత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.  భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలకు కూడా భారత  రాజ్యాంగం దారి చూపింది. శాసనవ్యవస్థ, కార్యనిర్వాహకవ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో అనేది కూడా నిర్దేశించింది. అయినప్పటికి నీ భారతదేశ ప్రజలు ‘శ్రమకు తగిన ఫలితాన్ని’ అనుభవించలేక పోతున్నారు. చదువు గగనమై పోయింది. కులం – మతం పేరుతో చదువును ప్రభుత్వాలే / పాలకులే అమ్ముతున్నాయి/ అమ్ముతున్నారు. వైద్యం ఎవరికీ అందుబాటులో లేదు ..ఒక్క డబ్బుకే అందుబాటులో ఉంది.  భారత రాజ్యాంగం చదువు గురించి   14 సంవత్సరాల వయస్సులోపు  బాలబాలికలకు  ఉచిత,  తప్పనిసరి  విద్యను ఇవ్వాలి అని చెపుతుంది.   రాజ్యం / ప్రభుత్వం తన భారత పౌరులందరికీ జీవనోపాధినీ, స్త్రీపురుషులందరికీ  సమాన ఉద్యోగాలు, పనులు, సమాన  జీతాలు  అనే సూత్రం పై నడవాలని,  ధనాన్ని,  ఆస్తులను,  ఒకేచోట  కేంద్రీకృతం  కాకుండా,  ప్రజలందరిలో విభజన  జరిగేలా  ప్రభుత్వం   చేయాలని,  దీనితో  ఉద్యోగవకాశాలు మెరుగవుతాయనీ, ప్రజలనూ, పిల్లలనూ కాపాడవలసిన బాధ్యత కూడా రాజ్యానిదే అని రాజ్యాంగంలో లిఖించబడింది. మరియు  రాజ్యం/ప్రభుత్వం, పౌరులకు, ఉచిత వైద్య సదుపాయాలు కల్పించవలెను. న్యాయాన్ని కూడా ఉచితంగా అందజేయవలసిన బాధ్యత రాజ్యానిది. పౌరుని దగ్గర డబ్బులేదని, అతనికి న్యాయం అందకుండా పోతే రాజ్యం  యొక్క   బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం అని కూడా రాజ్యాంగం చెపుతుంది. గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలిచ్చి, వాటిని స్వయంపరిపాలన చేసుకోగల పరిస్థితులను రాజ్యము కల్పించవలెననీ, కార్మికులకు సరైన వేతనాలు,  కనీస  వేతనాలు,  వారి పనులకు అనుగుణంగా ఏర్పాటుచేసి  అమలు పరచాలనియు,  సరైన  పనివేళలు,  సాంస్కృతిక కార్యక్రమాల సౌకర్యాలు కల్పించవలెననియు, చిన్నపరిశ్రమలు,  కుటీర పరిశ్రమలు  అభివృద్ధి  అయ్యే  విధంగా చూడాలనీ మనరాజ్యంగంలోని ఆదేశిక సూత్రాలలో   పొందు పరచబడి ఉన్నాయి.              భారత దేశ పౌరులందరికీ సమాన పౌరచట్టాలు తయారు చేసి వాటిని అమలు పరచేలా ప్రభుత్వాలు పని చేయాలినియు, పౌరుల ఆహార, పౌష్టికాహార, ఆరోగ్య విషయాల పట్ల ప్రభుత్వం   శ్రద్ధ  వహించి  తగుచర్యలు తీసుకొని సామాజికాభివృద్ధికినడుం కట్టాలనియు, మద్యపానము, ఇతర వ్యసనాలనునుండి  సమాజాన్ని విముక్తంచేయాలనియు, వ్యవసాయం, పశుగణాభివృద్ధి, పశువైద్యము, సమాజంలో చక్కటి  ఫలితాలను ఇచ్చేటట్లు ప్రభుత్వాలు  చూడవలెను అనియు, వాతావరణాన్ని, అడవులను, సామాజిక అడవులను  అభివృద్ధి పరచి, వన్యజీవుల పరిరక్షణా భారాన్ని ప్రభుత్వాలు బాధ్యత   వహించవలెను అనియు,  పౌరులకు పనిహక్కు, నిరుద్యోగభృతిని, వయసుమీరినవారికి, అనారోగ్యంగాఉన్నవారికి, అసహాయ పరిస్థితులలో ప్రజాసహాయాలు/ వసతులను కల్పించాలనియు, గర్భవతులకు తగు సదుపాయాలు ప్రభుత్వాలే కల్పించాలినియు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో పొందుపరచబడి ఉన్నాయి.  

Also read: నాగచైతన్య, సమంతల విడాకులు సరే, అసలు పెళ్ళి నమోదు చేసుకున్నారా?

ఆదేశికసూత్రాలుఅంటే 

భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాధమిక హక్కులను ఇచ్చింది. వీటిని ప్రభుత్వాలు  అమలు జరిపే  విషయంలో ప్రభుత్వాలకు రాజ్యాంగం  ఆదేశాలను ఇచ్చింది. వాటినే  ఆదేశిక  సూత్రాలు  అంటారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారతరాజ్యాంగం మార్గ దర్శకాలు చేసింది. ఈ మార్గదర్శకాలే ఆదేశాలు. ఇక్కడ ‘ప్రభుత్వ’మనగా భారత అంతర్భాగంలో అధికారాలు గల అన్ని అంగాలు -భారతప్రభుత్వం, పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలు, ఇతర అన్ని ప్రాదేశిక ప్రభుత్వాలు. ఉదాహరణకు ..  జిల్లా  పరిషత్తులు,  నగర పాలికలు, పురపాలికలు, పంచాయతీలు, గ్రామ పంచాయతీలు వగైరావగైరా. భారతదేశం ప్రాధమికహక్కులతో, ఆదేశికసూత్రాలతో, పౌరుల ప్రాధమిక విధులతో  ఈ “ఆదేశిక సూత్రాలు” నిర్మాణం చేయబడ్డాయి. 

ఆదేశికసూత్రాల ముఖ్య ఉద్దేశాలు –

ప్రజాప్రయోజనాలను, పౌరుల  సామాజిక,  ఆర్థిక అభివృద్ధిని,  ప్రజాస్వామ్యాన్ని,  ప్రజాహిత  రాజ్యాన్ని  స్థాపించడం, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకొనుటకు, బాధ్యత గలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వ పరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ప్రతీ పౌరుడూ  అభ్యున్నతితో అనుభవిస్తూ భద్రంగా జీవించేటందుకు, శ్రేయోరాజ్యఏర్పాటు. 

Also read: న్యాయమూర్తులను ప్రశ్నించడమే కోర్టు ధిక్కారమా?

పురోగామి ఆలోచనలు

ఆదేశిక సూత్రాల అమలు జరగకపోతే  ప్రాధమిక హక్కులకు విలువేలేదు. పంద్రాగష్టును  తప్పకుండా ఒక ఉత్సవంగానే భారతప్రజలు జరుపుకోవాలి. విదేశీయులపాలన నుండి  భారతదేశం స్వాతంత్రం సాధించటాన్ని, సాధించుకోవటాన్ని అభివృద్ధితో ముడి కట్టలేము. స్వాతంత్య్రం అంటే పరదేశ పాలన నుండి విముక్తిపొందడం, స్వయం పరిపాలన, స్వయం ప్రతిపత్తిని కలిగివుండటం. ఎప్పుడైతే దేశం  స్వయంపరిపాలన, స్వయంప్రతిపత్తిని పొందిందో … ప్రజలు అనుభవిస్తున్న, ఎదుర్కొంటున్న  సమస్యలు వెంటనే  తీరిపోతాయని ఒక ఊహాజనితమైన భావనకు ప్రజలు  లోనుకావటం సర్వసాధారణం. దీన్నిఅధికమించేటందుకు పాలకులు /ప్రభుత్వాలు  “అభ్యున్నతికి దారితీసే” ఆలోచనలు చేయకపోవటం, భారతరాజ్యాంగం ప్రజల గురించి ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి నోచెప్పే అధికారణాలపై  మాట్లాడేవ్యక్తులు, సమూహాలు, సంస్థలు, కార్యకర్తలు కొరవడటం కీలకమైన విషయం. 

ప్రజా ఉద్యమాల నిర్మణావశ్యకత

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 దాటి 75 లోకి అడుగు పెడుతున్నప్పటికిని ప్రజలు సుఖసంతోషాలను అనుభవించటం లేదు అని ఎవరి మార్గంలోవారు  ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూనే ఉన్నారు. అయితే, నేడు “భారతరాజ్యాంగం” అమలు గురించి ఉద్యమాల నిర్మాణం జరగవలసిన అవసరం సమాజంలో చాలా తీవ్రంగా ఉంది. మన భారతదేశపు పరిస్థితికి ఉదాహరణ ….  “ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్ముగారి  పూర్వీకుల గ్రామానికి తొలిసారిగా విద్యుత్రాబోతోంది అని, ఏళ్ల తరబడి చిమ్మచీకట్లలో మగ్గుతున్నమయూర్‌భంజ్ జిల్లా ఉపరెబేడ గ్రామంలో Electrification పనులను ఒడిశా ప్రభుత్వం చేపట్టింది…. “అని ఒక వార్తజూన్, 2022లో ప్రచురణ అయ్యింది. రోడ్ల నిర్మాణం జరగని ఊర్లతో, మంచి నీటి సౌకర్యంలేని గ్రామాలతో,  కట్టుకునేటందుకు సరి అయిన బట్టలు లేని అభాగ్యులతో, సొంత ఇళ్ళు లేని పేదలతో, మూడు పూటలకు  సరి అయిన ఆహరం కోసం ఎదురు చూసే సామాన్యులతో, భిక్షాటనతో బ్రతికే వారితో …  శ్రమ దోపిడీకి గురయ్యే వలసకార్మికులతో భారతదేశం దర్శనమిస్తుంది.

Also read: ఆ ఆరుగురు …..

అన్యాయాన్ని ఎదిరించాలి

స్వాతంత్య్ర పోరాటాలు, త్యాగాలు, నాటి జాతీయనాయకులు, అమరుల త్యాగం వృధా పోతుంది అని గోల చేసేది నేడు ఆపాలి. ప్రభుత్వాలు ఎందుకు “భారతరాజ్యాంగం”ను అమలు చేయట్లేదని “తిరంగాజెండా”ను పట్టుకొని నినదించాలి. ప్రభుత్వాలు “భారత రాజ్యాంగా”న్ని తమ సొంతలాభాల కోసం  వాడుకునేటందుకు భయపడతాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పని చేస్తాయి. ప్రజాఉద్యమకారుల చేతిలో తిరంగా జెండా ఒక ఆయుధంగా ఎప్పుడైతే మారునో అప్పుడే ప్రజాదోపిడీ ప్రభుత్వాలు, ప్రజలను పాలించే అర్హత నుండి పక్కకు జరుగుతాయి. తిరంగా జెండా చూపినదారి,  భారతరాజ్యాంగం నిర్దేశించిన మార్గం రెండింటిని జోడించటంతో వచ్చే  అద్భుతమైన ఫలితాలు ప్రజలు అందుకోగలరు.       

ప్రధానాంశాలు       

రాజ్యాంగంలో అవతారిక (పీఠిక) ప్రముఖమైనది.   రాజ్యాంగ  నిర్మాణం   ద్వారా భారతీయులు  తమకు  తాము అందివ్వదలచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పట్ల తమ నిబద్ధతను, దీక్షనూ ప్రకటించుకున్నారు.  భారత ప్రజలమైన మేము, భారత్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:

న్యాయం – సామాజిక, ఆర్థిక, రాజకీయన్యాయం;

స్వేచ్ఛ – ఆలోచనాస్వేచ్ఛ, భావప్రకటనస్వేచ్ఛ, మతావలంబనస్వేచ్ఛ;

సమానత్వం – హోదాలోను, అవకాశాలలోను  సమానత్వం;

సౌభ్రాతృత్వం – వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ఠ;

మా రాజ్యాంగ సభలోతేదీ : 26, నవంబర్ 1949 ఈ  రాజ్యాంగాన్ని స్వీకరించి,

ఆమోదించి,  మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే దానికి పూర్తి న్యాయం చేయవచ్చు.

Also read: నడుస్తున్న కథ

జైహింద్! 

 

Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles