Saturday, December 7, 2024

దేవుడు అవకాశం ఇచ్చినందుకు సంతోషం: జగన్

అమరావతి: అరకోటికి పైగా రైతులకు దాదాపుగా రూ.6800 కోట్లు సాయంగా అందిస్తున్న పథకం వైఎస్ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం. కొన్ని పథకాలు అమలు చేస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఇద్దరు, ముగ్గురు కాదు… ఏకంగా 50 లక్షల పైచిలుకు మంది రైతు కుటుంబాలకు ఈ ప‌థ‌కంతో మేలు జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపుగా 1.50 కోట్ల ఇళ్లు ఉంటే అందులో 50 లక్షల పైచిలుకు ఇళ్లకు మేలు చేస్తున్నాం. రైతు భరోసా ద్వారా దాదాపుగా ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇంటికి మేలు జరుగుతోంది. ఈ మేరకు పెట్టుబడి సాయం రైతులకు అందించగలుగుతున్నామంటే.. నిజంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles