Friday, April 19, 2024

నిరుద్యోగలకు శుభవార్త

నిరుద్యోగలకు శుభవార్త

  • రెండో విడతగా 3334 ఉద్యోగ నియామకాలకు  పచ్చజెండా ఊపిన ఆర్థిక శాఖ
  • ఎక్సైజ్, ఫారెస్ట్, ఫైర్ సర్వీసు శాఖల్లో ఖాళీల భర్తీకి  అనుమతులు జారీ

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు  శుభవార్త తెలిపింది. తొలి విడతగా 30 వేల 453 ఉద్యోగ ఖాళీల  భర్తీకి  ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఇవాళ తాజాగా మరో 3334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన జీవోలను జారీ చేసింది. శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు  80,039  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడంజరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర తొలి విడతగా 30 వేల 453 ఖాళీల భర్తీకి  అనుమతిస్తూ  ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది.  ఈ నియామక ప్రక్రియకువేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు  ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖ ల్లోని 3334 ఖాళీల భర్తీకి  ఆర్థిక శాఖ అనుమతులు తెలిపింది. మిగతా శాఖల్లోని   ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles