Wednesday, April 24, 2024

కర్తను తానే అంటాడు భగవంతుడు

భగవద్గీత 16

ఒక రాయిని చూడగనే అది గ్రానైటా, మార్బులా, సున్నపురాయా, పలకరాయా! అని చెపుతాము. పీల్చేగాలిలో వాసనబట్టి అది మలయమారుతమా, మురికాలువ మీదనుంచి వచ్చేగాలా? లేక ఎక్కడనుండి వస్తుందో చెపుతాము. నీటి రుచిని పట్టి ఇది ఏ నేలనుండి ఊరినదో చెపుతాము. భూమి స్వభావాన్ని బట్టి ఎర్రనేల, నల్లనేల, రాతినేల, ఇసుకనేల అని చెపుతాము. ఒక మామిడి చెట్టు ఉన్నదనుకోండి దానిని చూడగనే ఇది బంగినపళ్లా, తోతాపురా, రసమా, ఇమామ్‌ పసందా చెపుతాము. ఒక కుక్కను చూడగనే ఇది జర్మన్‌ షెపర్డా, ఆఫ్ఘన్‌ హౌండ్‌, ఆస్ట్రేలియన్‌ షెపర్డా అని చెప్పగలము. ఈ విధంగా చూసిన వెంటనే సృష్టిలోని ప్రతి వస్తువును దాని లక్షణాన్ని బట్టి అది ఏ జాతికి చెందినదో చెపుతాము!

Also read: ధర్మం గాడితప్పినప్పుడు పరమాత్ముడి జోక్యం

మరి మనిషి కూడా ప్రకృతిలో భాగమే కదా! అతనిని చూడగనే ఏవరో చెప్పగలమా? ఉహూ. వీలుకాదు. పైవాటన్నిటికీ పుట్టుకతో వాటి వర్గీకరణ జరిగిపోయింది కానీ మనిషి మాత్రం… అతని గుణములు, ఆ గుణములననుసరించి అతను చేసే పనుల బట్టి వర్గీకరించబడ్డాడు అని పరమాత్మ చెపుతున్నారు!

సృష్టి స్థావర, జంగమాత్మకమైనది… అంటే కదలనివి, కదిలేవి గా చెప్పవచ్చు…

చెట్లు, గుట్టలు=స్థావరాలు

పశు, పక్షులు, మనిషి=జంగమాలు.

గుట్టలు, రాళ్లు=ఆకారం అంటే శరీరం మాత్రమే ఉంది.

చెట్లు=శరీరము+ప్రాణము+తక్కువగా చైతన్యము

జంతువులు=శరీరము+ప్రాణము+కొంత చైతన్యము

మనిషి=శరీరము+ప్రాణము+చైతన్యము+మనస్సు+బుద్ధి+అహంకారం

సృష్టిలో మిగతావాటినుండి మనిషిని వేరుచేసేది మనస్సు, బుద్ధి అహంకారాలే. ఇవి చూడగనే కనపడవు… కానీ వీటివల్లనే త్రిగుణాలేర్పడ్డాయి…

Also read: ‘అమిద్గల’ మాయాజాలం

అవి మూడు…సత్త్వం, రజస్సు, తమస్సు…

సత్త్వము=సృజనాత్మకత, ప్రశాంతత, సానుకూల దృక్పధము, సద్భావన, సమగ్రత్వము….

రజస్సు=శక్తి (energy) ,ముందుకు కదిలే స్వభావము (motion)

తమస్సు=నిలకడలేమి, విధ్వంసము, భ్రమ, జడత్వము, మాలిన్యం, బద్ధకము, మూఢత్వము…

ఈ గుణాల ఆధారంగా మాత్రమే మనిషి వర్గీకరింపబడ్డాడు…. అంతేకాని పుట్టుకతోనే అతనెవరో చెప్పలేము.

చాతుర్వర్ణమ్‌ మయా సృష్టం గుణ కర్మ విభాగశః

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్‌.

నాలుగు వర్ణాల వారినీ వారి వారి గుణ కర్మల ననుసరించి సృష్టించితిని, ఈ కార్యక్రమమునకు కర్త నేనే అయినప్పటికీ అకర్తను అని తెలుసుకో.. అని పరమాత్మ చెపుతున్నారు…

Also read: కర్మ బ్రహ్మము నుంచి పుట్టినది

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles