Thursday, April 18, 2024

ఆహార నియమాలూ, ఆరోగ్యం

రైటప్: ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను వివరిస్తున్న సద్గురు

భగవద్గీత – 50

We eat to live. మనం బ్రతకడానికి తింటాం.

We live to eat.‌ మనలోకొందరు తినడానికే బ్రతుకుతారు. ఏం తినాలి ఎలా తినాలి?  మనం తీసుకునే ఆహారం మన మీద ఏం ప్రభావం చూపుతుంది?

మామూలుగా చూడండి. కాయగూరలు, తియ్యని పదార్ధాలు పాలు, నెయ్యి ఇలాంటివి తినేవారు `సత్వగుణం` కలిగి ఉంటారు.

Also read: అసురీ ప్రవృత్తి అనంత రూపాలు

చేదుగలవి, పులుపుగా ఉన్నవి బాగా కారం మసాలాలు, రకరకాల రుచులు కావాలనుకొనేవారు `రాజస స్వభావం` కలిగివుంటారు. కస్సున లేస్తూ ఉంటారు.

ఉడికీ ఉడకక బాగా పులిసిపోయి ఎక్కడబడితే అక్కడ శుభ్రతలేని వాతావరణంలో తినేవారిలో `తామస` లక్షణాలుంటయి. (పుల్లట్లు చాలా మందికి ఇష్టం. అవి తిన్నరోజు ఆవలింతలు ఎక్కువ వస్తాయి గమనించారా?)

మనం తినే ఆహారం మన mood నిర్ణయిస్తుంది అని చాలా పరిశోధనలు మనకు తెలియచేసాయి! అసలు మనం ఎన్నిసార్లు బోజనం చేయాలి? ఈ సందేహము అందరికీ కలుగుతుంది. దీనికి సూర్యునితో ముడిపెట్టారు మన పెద్దలు.

Also read: వివాహ వేడుకలో అపశ్రుతులు

యామమధ్యే న భోక్తవ్యం

యామయుగ్మం న ల్ఘయేత్‌…

ఒక యామం అంటే 3 గంటలు. రోజుకు ఎనిమిది యామాలు. సూర్యోదయం నుండి యామాలు లెక్క అంటే మొదటి యామం అయిన తరువాత భోజనం చేయాలి. అంటే సూర్యోదయం 5-30 అనుకోండి 8-30 నుండి 11-30 లోపు భోజనం చేయాలి. మనం తిన్న భోజనం అరగటానికి కనీసం ఆరుగంటలు సమయంకావాలి! అందుకే సూర్యాస్తమయం అయిన మూడుగంటలలోపు భోజనం ముగించేయాలి. రోజుకు రెండుసార్లు మాత్రమే భుజించాలి. తినడానికి మాత్రమే పుట్టిన ఈ కాలంలో సాధ్యమవుతుందా? అవ్వదు. అందుకే ఇన్ని  corporate hospitals, ఇన్ని medical insurance కంపెనీలు.

కాలాన్ని బట్టి కూడా ఆహారం నిర్ణయించారు. ఉదాహరణకు శీతాకాలంలో చాలా తక్కువ భుజించమంటారు. ‘‘యమదంష్ట్ర’’ అని ఒక సమయం ఉన్నది. అది కార్తీకమాసపు చివరి ఎనిమిదిరోజులు. మార్గశిరమాసపు మొదటి ఎనిమిది రోజులు కలిసిన కాలం అన్నమాట. ఈ పదహారు రోజులు ఎంత తక్కువ తింటే అంత మంచిదట.

Also read: మన ప్రవృత్తి ఏమిటి?

గీతాచార్యుడయిన కృష్ణుడు ఏంచెపుతున్నాడంటే…

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః

ఆహారా రాజసస్యేష్టా దుః ఖశోకామయప్రదాః

చేదు, పులుపు, ఉప్పు, కారము, బాగావేడి, మాడిన ఆహార పదార్ధములు దుఃఖ శోకమయములు. ఇవి రాజస ప్రవృత్తికలిగిస్తాయి. రాజస ప్రవృత్తి కలిగిన వారికి ఇవి ఇష్టము. హిత, మిత ఆహారం తీసుకోవాలి. ఏదయినా తిన్నది చక్కగా జీర్ణమవ్వాలి. దానిని ’’సమ్యఃకరణ’’ అంటారు జీర్ణంకాగా మిగిలినది బయటకు వెళ్లిపోవాలి ఇది ‘‘బహిష్కరణ’’. ఇవి చక్కగా ఉంటే ఆరోగ్యం మన వెంటే.

Also read: మనం ఎటు పోతున్నాం?

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles