Saturday, April 20, 2024

దేవుణ్ణి కనుగొనటం

                       ————————–

(‘FINDING GOD’ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)

తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్

                   44. సంచారి తత్త్వాలు

                   ——————————–

        ఇద్దరు వ్యక్తులు ఒక లోయలో నడుస్తూ వెళుతున్నారు. వారిలో ఒకతను వేలును కొండవైపు చూపిస్తూ ఇలా అన్నాడు.” ఆ ఆశ్రమాన్ని చూశావా? ఎప్పుడో ఈ లోకానికి విడాకులిచ్చిన ఒక పెద్ద మనిషి అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఆయన దేవుని అన్వేషణలో ఉంటాడు. అతనికి ఇంకేమీ అవసరం లేదు. “

        రెండో వ్యక్తి ఇలా అన్నాడు.” ఆ ఆశ్రమం, ఒంటరితనం వదిలి మన లోకంలోకి వచ్చి, మన ఆనందాలూ, బాధలూ పంచుకుంటే తప్ప, వివాహ విందుల్లో మన నాట్యకారులతో  నాట్యం చేస్తూ ఆనందిస్తే తప్ప, చనిపోయిన వారి శవ పేటికల వద్ద దుఃఖించే వారితో కలిసి దుఃఖిస్తే తప్ప — ఆయన దేవుణ్ణి కనుగొనలేడు.”

        మొదటి వ్యక్తి ఆ రెండో వ్యక్తి చెప్పిన మాటలు అంతరంగంలో ఒప్పుకున్నాగానీ, ఇలా జవాబిచ్చాడు.

” నువ్వు చెప్పినది సబబే. కానీ ఆ సన్యాసి మంచి మనిషి. మంచిగా ఉన్నట్లుగా కనబడే చాలా మంది మనుషులకన్నా, నిజంగా మంచి మనిషి ఐన ఒక వ్యక్తి మన మధ్య లేకుండా చేసే మంచి ఎక్కువ కాదా?

Also read: డెభ్భై ఏళ్ళు

Also read: ప్రార్థన

Also read: నీడ

Also read: శాంతి ఒక అంటు వ్యాధి

Also read: మంచి — చెడు

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles