Monday, July 26, 2021

అక్షర క్షేత్రం

అక్షర క్షేత్రం కవులుకు తీసుకొన్న కవిని

కాస్త చేలలో అటు ఇటుగా

చేతనయినంత  తేట తెలుగు కవిత

ఇంకాస్త పొలంలో ఇంగ్లిష్ పోయెమ్

రెండు పండిస్తా.

విత్తు నేనే, నీరు నేనే

హలము  నేనే, హల చోదకుడినీ నేనే

ఎరువు నేనే,  పురుగుల మందు నేనే

కలుపు నేనే,  కంకి నేనే…

కాని పంట మాత్రం నాది కాదు

పండితోత్తములారా!

దంచి,  వండి తిని బాగుందన్న

గింజ పుచ్చు దనో,  ఉడకదనో అన్నా

తప్పు నాది కాదు అన్నలారా…

షోలే లో సోషలిజం,

అడవి రాముడు లో అద్వైతం…

 హన్నా… ఉండవన్నా!

ఇక్కడ సరుకు అంతే…

ఎటునుంచి లెక్క వేసినా సున్నా!

Also read: చవుడు భూమి

Also read: పాత కథ

Also read: చరిత్ర

Also read: భాష్పాంజలి

Also read: చందమామ

MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles