- వ్యాక్సిన్ ఎగుమతి పట్ల మోదీ హర్షం
- టీకాల తయారీలో భారత్ విశ్వశనీయపాత్ర
సరిహద్దు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను ఎగుమతి ప్రారంభమయినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మిత్ర దేశాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసేందుకు వీలుగా భూటాన్, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, సీషెల్స్ దేశాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేయనున్నారు.
సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవషీల్డ్ వ్యాక్సిన్ లను భూటాన్ కు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఒప్పందంలో భాగంగా1,50,000 డోసులతో ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భూటాన్ రాజధాని థింపుకి ఈ రోజు (జనవరి 20) బయలుదేరింది. మాల్దీవులకు కూడా లక్ష డోసుల టీకాలను భారత్ ఎగుమతి చేయనుంది. కరోనా నేపథ్యంలో భారత సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ లను సరిహద్దు దేశాలకు ఉచితంగా ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ గతంలోనే ప్రకటించింది. శ్రీలంక, ఆఫ్గనిస్తాన్, మారిషస్ దేశాలనుంచి ఎన్ని వ్యాక్సిన్ డోసులు అవసమో ఇంకా సమాచారం అందలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఇది చదవండి: భారత్ లో ప్రారంభమైన టీకా పంపిణీ
2 మిలియన్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను భారత్ నుండి ఉచితంగా అందుకోనున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించింది. రేపు (జనవరి 21) ఢాకా లోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోనున్నాయి. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం సీరం సంస్థతో మరో 30 మిలియన్ డోసుల వ్యాక్సిన్ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. 5 లక్షల జనాభా ఉన్న మాల్దీవులకు భారత్ ఉచితంగా రెండు లక్షల డోసులను ఇవ్వనుంది. మాల్దీవులకు కావాల్సిన మరో 3 లక్షల డోసులను సీరం సంస్థ నుంచి మార్కెట్ రేట్లకు కొనుగోలుచేయనుంది. పేద దేశాల అవసరాలు తీర్చేందుకు సీరం సంస్థ 200 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థక సరఫరా చేయనున్నట్లు సీరం యాజమాన్యం తెలిపింది.
ఇది చదవండి: కరోనా టీకాల పంపిణీకి సర్వం సిద్ధం
వ్యాక్సిన్ ఎగుమతి పట్ల ప్రధాని హర్షం
ఇతర దేశాలకు భారత సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ లు ఎగుమతి చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య అవసరాలు తీర్చడానికి భారత్ విశ్వశనీయమైన భాగస్వామి పాత్ర పోషించడం గర్వకారణమని అన్నారు.
ఇది చదవండి: చైనాలో మళ్లీ కరోనా కలకలం