Tuesday, April 16, 2024

“స్త్రీ”

ఆదిశక్తి స్వరూపిణి

మాతృ దేవత

తోడబుట్టినది

జీవితం పంచుకున్నది

కన్న బిడ్డ

గ్రామ దేవత

వన దేవత

నదీమ తల్లి

దేశ మాత

తెలుగు తల్లి

అనేస్తారు అలవాటుగా.

వంటింటి కుందేలు స్థాయి నుండి

ఏలిక స్థాయి వరకు

అన్నిటా మగవారితో సమానంగా ఎదిగినా

ఆడది కనిపిస్తే మగవాడు చూసేది ఆక్కడే

సినిమాల ప్రభావమో

బూతు సినిమాల అలవాటో

టీవీలో హాస్యం పేరిట జరిగే కార్యక్రమాలో

ఆడవాళ్ళ వస్త్రధారణో

మగవారి కుసంస్కారమో

కారణాలు ఏవైనా

రోజు రోజుకు దిగజారుడే

ప్రమాదపు అంచున బ్రతకడమే.

ఒకప్పుడు మగవాడు సిగరెట్ తాగడం ఫ్యాషన్

ఇప్పుడు వనిత మద్యం తాగడం ఫ్యాషన్

ఈ పరిస్థితులకు కారకులెవరైనా

సరిదిద్దే ప్రయత్నం జరగడం లేదు

ఎవరైనా ప్రయత్నిస్తే

ఛాందసమని చప్పరించేస్తున్నారు

వ్యతిరేకిస్తే ఉప్పెనలా దూకుతున్నారు

అబల సబలగా మారే సంధి కాలంలో

పుట్టిన కుక్క మూతి పిందెలా ఇవి?

Also read: “కామ దహనం”

Also read: “కర్తవ్యం”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles