Friday, March 29, 2024

పితలాటకం మనిషి

సెటైర్

మా ఆయన వీణ్ణెవడ్నో కెమేరామెన్ను అని తెచ్చాడు …

మేకప్పుకో … ఫొటో దిగుదామని పొద్దున్నుంచీ ఒకటే నస …

సరే అని పొద్దున్న స్నానం చేసింది లగాయతు … ఇదుగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అనడంతో …  ఇప్పటికి  ఓ ఇరవై ఎనిమిది సార్లు ముఖాన్ని సబ్బెట్టి కడిగాను.

Also read: థింక్ బిగ్ అండ్ ఎఛీవ్ బిగ్ …

ఇంకోసారి కడిగితే వేరే ముఖం చూసుకో అని నా ముఖం నా నుంచీ వెళ్లిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.

మరి మీరు కడుక్కోరేం అని అడిగితే … నేనెలాగూ డైరక్టర్ నేగా అంటారు.

 పెద్ద పెడసరం మనిషి …

అందరూ నన్ననుకుంటారుగానీ …

మగాళ్లల్లో చాలా మంది పితలాటకం మనుషులుంటారు తెల్సా …

ఇలాంటివి చాలా మందికి తెలీవనే నేను కథలూ పాడూ రాసి ఆ పత్రికలకు పంపాను తప్ప నాకేదో తెలుగు సాహిత్యాన్ని ఉద్దరించేద్దామనే తాపత్రయం అస్సల్లేదని చెప్తున్నా.

Also read: మాయాబజార్ నలుగురు అమ్మల కథ

 కావాలంటే గ్యాస్ స్టవ్ మీద ఓత్ తీసుకుని మరీ చెప్పగలనీమాట.

ఇప్పుడేంటి మాట్లాడుతున్నాన్నేనూ  …

 ఆ

మగాళ్లు పితలాటకం వాళ్లని కదూ ఇది చాలా మంది ఆడవాళ్లకి అదే పెళ్లైన వాళ్లకి అనుభవమే …

మార్కెట్లో చాలా మంచివాడు అనే ఇమేజ్ ఉన్న మొగుళ్ల పెళ్లాలు పడే నరకయాతన అంతా ఇంతా కాదు.

ఎవరేనా వచ్చి ఏదైనా సాయం చేయమంటే తగుదునమ్మా అని దూసుకెళ్లిపోతారు …

 వెళ్లి అక్కడ రెండున్నర బక్కెట్ల ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోతారు.

మళ్లీ మనమే రంగంలోకి దిగి వారిని రక్షించాలి.

Also read: మిసెస్ తేడాసింగ్ లెక్చర్ ఆన్ యాప్ వరల్డ్

 ఆ ప్రాసెస్ లో మనం కాస్త కటువుగా ఫట్ ఫట్ మని మాట్లాడేసి ఈయన్ని ఇవతలికి ఈడ్చుకు వస్తాం కదా …

అప్పుడు ఆ సాయం కోరిన వాళ్లూ వాళ్ల చుట్టుపక్కలవాళ్లూ … వాడు సాయం చేస్తానన్నాడు కదా అని వీళ్లు అంతకు ముందు సాయం అడిగిన వాల్లు … ఈయన రంగంలోకి దిగ్గానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నవాళ్లూ ఇల్లా …

ఈ నానా జాతి వాళ్లూ కూడాను

 ఆయన చాలా మంచోడు … ఈవిడే మహంకాళి మారెమ్మా … అతగాడ్ని ఇటువైపు చూడకుండా కట్టడి చేసేసింది … పాపం పెళ్లాం అలా ఉంటే ఈయన మాత్రం ఏం చేయగలడు … ఎంత మంచివాడైతే మాత్రం అని నానా బూతులూ మాట్లాడేసుకుంటారు మన గురించి …

అందుకే మంచితనం అనేది చాలా వాల్యుబుల్ ప్రాడక్ట్ గురూ …

చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి …

ఫారన్ సెంట్ లా అన్జెప్తా ఆయనకి రోజుకు పది సార్లో నూటా యాభై సార్లో …

విన్నట్టు నటించి వాళ్లిష్టం వచ్చినట్టు వాళ్లు చేసుకుపోవడమే కదా … దిస్ టైప్ హజ్బంట్స్ చేసేది …

అదే ఈయనా చేస్తారు …

అంచేత కంఠశోష అంటారు కదా …

అదెందుకు … అనిన్నీ …

అలాగే అసలే నేను సింగర్ని కూడా కావడం చేతన్నూ కూడా ఈయనికి హితబోధలు చేయడం మానేసి నా ఏడుపేదో ఇలా ఈ ఫొటోలో కనిపిస్తున్నాను కదా … అల్లా ఏడుస్తున్నానన్నమాట …

నా వెనకాల నుంచుని నవ్వుతున్నట్టు ఫోజెట్టిన ఈ పెద్దమనిషి ఆ కెమేరా వెనక్కి వస్తే నా అవస్ధ తెలుస్తుంది.

ఆయనేమో రారు.

డైరక్టర్ అన్నాక కెమేరా వెనకాల నిలబడి ఆర్టిస్టుల కష్టాలు చూడాలన్నా ..

సీన్ చెప్పేశాం కదా అని తాంటూలాలిచ్చేశాం తన్నుకు చావమనే టైపు ఈయన …

అందుకే ఆ నాగేస్వర్రావు వాళ్లూ ఈయనంత మంచోడు లేడంటారు …

ఈ మంచోళ్లు ఈజ్ టూ డేంజరస్ అనేది మీకు చెప్పడం కోసం … ఈ ఫొటో ఇలా పెడుతున్నానన్నమాట …

ఇట్లు

– భానుమతి గారు

Also read: బాపు రమణలు ఎంతటి దుర్మార్గులో తెలిస్తే అవాక్కవుతారు!

భరద్వాజ రంగావఝల
భరద్వాజ రంగావఝల
పేరు భరద్వాజ రంగావఝల. వృత్తి జర్నలిజం. బాపు రమణ అంటే వల్లమాలిన అభిమానం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles