Saturday, July 20, 2024

పగటి కలలు

పగటి కలలు నీ ఇష్టం మిత్రమా!

నీ నిగూఢ మైన ఊహలు,

అణచి ఉంచిన కోరికలు,

వింత వింత ఆశలు

రెక్కలు రెప రెప లాడించే

దేవ దూతలై వచ్చి

సహస్ర వర్ణాలతో

అబద్ధపు చిత్రాలు

నీ ముందు ఆవిష్కరిస్తాయి.

రాత్రి అలా కాదు!

నిశా పిశాచాల నీడలు

నీవు ఉలిక్కి పడే

స్వచ్ఛమైన నిజాలనే

సజీవంగా

నీ ముందు నిలబెడుతాయి.

Also read: భాష

Also read: సన్మానం

Also read: కత్తులు, కరవాలాలు

Also read: జీవన సంధ్య

Also read: ఆకాశ హర్మ్యం

MAHATHI
MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles