Wednesday, April 24, 2024

డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయండి : సీపీఎం పిలుపు

  • డిసెంబర్ 8న జరుగు భారత్ బంద్, రోడ్ల దిగ్బంధంలో పాల్గొనాలని జిల్లా ప్రజానీకానికి CPM మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపు

కేంద్రాన్ని పరిపాలిస్తున్న ఆర్ఎస్ఎస్,బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ కాంట్రాక్టర్లకు కట్ట బెట్టడానికి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇవి అమలవుతే భూములన్ని కార్పొరేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లడం జరుగుతుంది. దీని ఫలితంగా రైతులతో పాటు ఆహార పదార్థాలు తినే ప్రతి ఒక్క వ్యక్తి కార్పొరేట్ కాంట్రాక్టర్ల పైన ఆధారపడి బ్రతక వల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంతటి ప్రమాదకరమైనటువంటి చట్టాలను రద్దు చేయాలని రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.నవంబర్ 25 నుండి ఢిల్లీ నగరం సమీపంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులను ఢిల్లీ నగరంలోకి రాకుండా అడ్డుకోవడం కోసం మోడీ ప్రభుత్వం రోడ్లలపైన అడ్డంగా భారీ కందకాలు తవ్వించడం జరిగింది.నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పైన టియర్ గ్యాస్ ప్రయోగాలు చేస్తూ నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది.నైజాంను మించిన పాలనను దేశాన్ని పరిపాలిస్తున్న RSS, BJP నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నాడు.

ఒకపక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేట్ పరం చేయడానికి నిర్ణయించిన ప్రభుత్వం. నేడు వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం చట్టం తీసుకురావడం అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కార్పొరేట్ కంపెనీ కాంట్రాక్టర్ల దగ్గర కూలీలుగా మార్చే పరిస్థితులు నరేంద్ర మోడీ ప్రభుత్వం సృష్టిస్తుంది. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పకపోతే భవిష్యత్ తరానికి భవిష్యత్తు ఉండే పరిస్థితి లేదు.అందుగురించి డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది, ఇదే రోజు రోడ్ల దిగ్బంధన కార్యక్రమం కూడా జరుగుతుంది. మంచిర్యాల జిల్లా ప్రజలు, కార్మికులు,ఆటో రిక్ష, హోటల్స్,షాపులవారు.

అన్ని తరగతుల వారు ఈ భారత్ బంద్ లో పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని రైతులను,వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని భారత్ బంద్ జరుగుతుంది. పోరాటంలో స్వచ్ఛందంగా మంచిర్యాల జిల్లా ప్రజలు పాల్గొనాలని CPM పార్టీ పిలుపునిస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, గూళ్ల బాలాజీ,దాసరి రాజేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు, మరియు పట్టణ నాయకులు ఝాన్సీ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles