Tuesday, November 12, 2024

ఉపఎన్నికల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  డాక్టర్ శశాంక్ గోయల్
  • కమలాపూర్ మండలం లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
  • పాల్గొన్న కరీంనగర్, హనుమకొండ  కలెక్టర్లు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి

కరీంనగర్ : ఈ నెల 30 న జరుగనున్న హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు.  శనివారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు), ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ,  అంబాల జడ్.పి.హెచ్. ఎస్, గూడూరు ప్రాథమిక పాఠశాల లోని పోలింగ్ కేంద్రాలను  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్,   కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ .వి కర్ణన్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జ్యోతిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని 290, 291,287,286,266,267,269,268,265  నెంబరు గల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమలాపూర్ జడ్.పి.హెచ్ఎస్ పాఠశాల ఆవరణలో పాత్రికేయులతో మాట్లాడారు. పోలింగ్ రోజున ఓటర్ల  రద్దీ లేకుండా, కోవిడ్ నిబంధనల మేరకు వారిని వరుసక్రమంలో ఓటు వినియోగించుకునెందుకు పంపించాలని  అధికారులకు సూచించారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలని, చేతులు సానిటైజ్ చేసుకోవాలని,  భౌతిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశ వర్కర్  ను నియమించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు, ఫర్నిచర్, విద్యుత్, టాయిలెట్ సౌకర్యం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం  ఎన్నికల అధికారులు పోలీస్ అధికారులతో సమావేశమై ఎన్నికల  సరళి ,నిర్వహణపై  చర్చించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, హనుమకొండ  ఇంచార్జి డి ఆర్ ఓ వాసు చంద్ర, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్: హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్. వి కర్ణన్ శనివారం సందర్శించారు. ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో ముద్రించిన బ్యాలెట్ పత్రాలు పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఎన్నికల సామాగ్రిని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రిని తీసుకువెళ్లేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి  ఆర్ డి ఓ సిహెచ్ రవీందర్ రెడ్డి ఉన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles