Thursday, March 28, 2024

మీడియా లేకుండానే చెన్నై టెస్టు మ్యాచ్ లు

  • బీసీసీఐకి కూరలో కరివేపాకులా మారిన మీడియా
  • బయోబబుల్ వాతావరణంలో క్రికెటర్లు
  • కోవిడ్ నిబంధనలతోనే ఇంగ్లండ్ సిరీస్

భారత దేశంలో క్రికెట్.. అనధికారిక జాతీయక్రీడగా పాతుకుపోవడంలో మీడియా పాత్ర అంతాఇంతాకాదు. అభిమానులతో క్రికెట్ బ్రహ్మరథం పట్టించినా, క్రికెటర్లను హీరోల నుంచి దేవుళ్లస్థాయికి తీసుకువెళ్లినా అది కేవలం మీడియా పుణ్యమే. అయితే…కరోనా వైరస్, కోవిడ్ నిబంధనల సాకుతో అస్సలు మీడియా లేకుండానే మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.ఐసీసీటెస్టు ఛాంపియన్ షిప్ లీగ్ లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్ తో జరిగే నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మొదటి రెండు టెస్టులకూ అభిమానులతో పాటు అధికారిక బ్రాడ్ కాస్టర్ మినహా మిగిలిన మీడియాను అనుమతించరాదని బీసీసీఐ నిర్ణయించింది.

ఈసీబీ సూచన మేరకే:

England and Wales Cricket Board (@ECB_cricket) | Twitter

ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకే తాము చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి జరిగే తొలిటెస్టు, ఫిబ్రవరి 13 నుంచి జరిగే రెండోటెస్టుకు ప్రేక్షకులతో పాటు మీడియాను అనుమతించరాదని నిర్ణయించినట్లు బీసీసీఐ సీఈవో హేమంగ్ అమీన్, తమిళనాడు క్రికెట్ సంఘం కార్యదర్శి ఆర్ఎస్ రామస్వామి ప్రకటించారు. టీవీ ప్రత్యక్షప్రసారం ద్వారా మాత్రమే మ్యాచ్ ను వీక్షించి మీడియా రిపోర్టు చేసుకోవాలని సలహా ఇచ్చారు.

ఇది చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్లకూ క్వారెంటెన్

అందరి కళ్లూ సిరీస్ పైనే:

మరోవైపు ఐసీసీటెస్టు ఛాంపియన్ షిప్ లీగ్ టోర్నీ పైనల్స్ చేరడమే లక్ష్యంగా  భారత ఉపఖండంలో టెస్ట్ క్రికెట్ నాలుగో ర్యాంకర్ ఇంగ్లండ్ జైత్రయాత్ర మొదలు పెట్టింది.  శ్రీలంకతో జరిగిన రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0తో ఇంగ్లండ్ అలవోకగా నెగ్గి భారత్ తో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సమరానికి సై అంటోంది. శ్రీలంక టూర్ ను విజయవంతంగా ముగించుకొన్న ఇంగ్లండ్ జట్టు కొలంబో నుంచి బుధవారం చెన్నైకి చేరుకోనుంది. భారత క్రికెటర్లు సైతం బృందాలు బృందాలుగా చెన్నైకి రానున్నట్లు తమిళనాడు క్రికెట్ సంఘం తెలిపింది.

వారంలో రెండుసార్లు కోవిడ్ టెస్టులు:

ఇంగ్లండ్, భారత క్రికెటర్లు చెన్నై చేరిన వెంటనే వారం రోజుల వ్యవధిలో మూడు రోజులకోసారి కోవిడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి నెట్ ప్రాక్టీసుకు అనుమతిస్తామని తమిళనాడు క్రికెట్ సంఘం ప్రతినిధి తెలిపారు. క్రిమిరహిత వాతావరణంలో క్రికెటర్లను, మ్యాచ్ నిర్వాహకులను ఉంచడానికి వీలుగా చెన్నైలోని లీలా పాలస్ హోటెల్ ను తమిళనాడు క్రికెట్ సంఘం బుక్ చేసింది. హోటెల్ లోని భద్రతా సిబ్బంది సైతం బయోబబుల్ పరిథిలో ఉండితీరాల్సిందేనని నిర్వాహక సంఘం స్పష్టం చేసింది.

ఇది చదవండి: భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్

మూడంచెలుగా బయోబబుల్:

కరోనా వైరస్ నేపథ్యంలో బయోబబుల్ వాతావరణం పాదుకొనేలా చేయటానికి, సురక్షితంగా ఉండటానికి వీలుగా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కోసం వచ్చే అధికారిక బ్రాడ్ కాస్టర్ సిబ్బందికి హోటెల్ ఐటీసీ గ్రాండ్ చోళ లోని ఓ ఫ్లోర్ మొత్తాన్ని కేటాయించారు. బయోబబుల్ వాతావరణంలో భాగంగా మొత్తం మూడంచెలజోన్లు ఉంటాయని క్రికెటర్లు, అధికారులు, టెలివిజన్ సిబ్బంది ప్రధాన జోన్ లో ఉంటారని, వీరికి మాత్రమే గ్రౌండ్ లోకి అనుమతి ఉంటుందని, తమిళనాడు క్రికెట్ సంఘం ప్రతినిధులు, మ్యాచ్ నిర్వాహకులు రెండో జోన్ లో ఉంటారని, పోలీసులు, ఇతర అధికారులు మూడో జోన్ లో ఉంటారని, వీరిని ఎట్టి పరిస్థితిలోనూ స్టేడియం లోపలికి అనుతించబోరని వివరించారు.

స్పోర్టివ్ పిచ్ సిద్ధం:

ఫిబ్రవరి 5నుంచి ప్రారంభమయ్యే తొలిటెస్టు కోసం తాజా పచ్చికతో స్పోర్టివ్ పిచ్ ను సిద్ధం చేసినట్లు క్యూరేటర్ వీ.రమేశ్ కుమార్ తెలిపారు. చెపాక్ వికెట్లను సరికొత్తగా రూపొందించామని,గత కొంతకాలంగా మ్యాచ్ లే జరగలేదని, పైగా వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉందని, బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కు అనువుగా ఉండేలా వికెట్ ను రూపొందించినట్లు వివరించారు. వికెట్ పైన ఎంతమేరకు పచ్చిక ఉంచాలో భారత చీఫ్ కోచ్, కెప్టెన్ల సూచనల మేరకు ఉంటుందని తెలిపారు.

ఇది చదవండి: ఇంగ్లండ్ తో సిరీస్ కు కొహ్లీ, పాండ్యా, ఇశాంత్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles