Wednesday, April 24, 2024

తిరుపతిలో హిందుత్వ అజెండా అమలు చేస్తున్న తెలుగుదేశం

నారా చంద్రబాబు నాయుడు

  • ఉప ఎన్నిక ప్రచారంలో కొత్త పంథా అనుసరిస్తున్న టీడీపీ
  • రాబిన్ శర్మ సూచనలను పాటిస్తున్న చంద్రబాబు
  • పార్టీ గెలుపుకోసం సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు

 తిరుపతి నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం చంద్రబాబు సర్వశక్తులనూ ఒడ్డుతున్నారు. పార్టీ విజయం కోసం భారీ ఎత్తున నాయకులను మోహరిస్తున్నారు. సుమారు 70 మంది సీనియర్ నేతలకు ప్రత్యేక బాధ్యతలకు అప్పగించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. సంక్రాంతి హడావుడి ముగిశాక  కీలక నేతలకు గ్రామాలు, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

సీనియర్లకు కీలక ప్రచార బాధ్యతలు

తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉఫ ఎన్నిక కోసం తెలుగుదేశం విభిన్న వ్యూహాలు రచిస్తోంది. మిగతా పార్టీలకంటే ముందే అభ్యర్థిని ప్రకటించి ఆందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే విభిన్న శైలిలో ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంక్రాంతి అనంతరం ఈ నెల 17 నుంచి ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో ప్రచారం ప్రారంభించాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించారు. ప్రచారంలో భాగంగా జనవరి 17నే తిరుపతిలో పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు అచ్చెన్నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ గెలుపుకోసం నియోజకవర్గ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.

ఇదీ చదవండి:రామతీర్థంలో రాజకీయాలు

కార్యకర్తలకు సోషల్ మీడియా ప్రచార బాధ్యతలు

బూత్ స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు ముఖ్యమైన కార్యకర్తలకు  ప్రచార బాధ్యతలను అప్పగించింది. వీరంతా సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించనున్నారు.  పార్టీ సోషల్ మీడియా విభాగమైన నుంచి జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రచారంలో ముఖ్యంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ పాలనా లోపాలు, నిత్యావసర ధరలు మద్యం మాఫియా, ఇసుక పాలసీలతో పాటు ఎస్సీలపై దాడుల అంశాలతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: పార్టీ బలోపేతానికి చంద్రబాబు కసరత్తు

దేవాలయ దాడులకు విస్తృత ప్రచారం

అయితే  గతానికి భిన్నంగా టీడీపీ ఈ సారి హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈవిషయంలో ఈ సారి బీజేపీ టీడీపీ గట్టి పోటీనివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామతీర్థం ఘటనను హైలెట్ చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:దేవాలయాలపై దాడులను ఉపేక్షించం-చంద్రబాబు

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles