Thursday, April 25, 2024

పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

  • శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
  • ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, గవర్నర్ తమిళసై

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

డీఎంకె అధినేత ఎంకె స్టాలిన్ కూడా సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డీఎంకె పార్టీ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి, దక్షిణాది దిగ్గజ నేత కె.చంద్రశేఖర్ రావుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలంగాణ కోసం,దేశం కోసం ఆయన మరిన్ని సంవత్సరాలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజలకు సేవ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

గవర్నర్ తమిళ సౌందరరాజన్ సీఎంకు ట్వట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్, హరీశ్ రావులు కూడా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు.

కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు, సామాజిక‌వేత్త‌లు, హ‌రిత ప్రేమికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles