Tuesday, April 16, 2024

వంతెన నిర్మాతలు

                      ————————–

( ‘ BUILDERS OF BRIDGES’ FROM ‘ THE WANDERER’ BY KHALIL GIBRAN)

తెలుగు అనువాదం : డా. సి. బి. చంద్ర మోహన్

             23. సంచారి తత్త్వాలు

             ——————————

     ఏంటియొక్ నగరంలో  — అస్సీ నది సముద్రంలో కలిసే చోట , నగరం రెండు సగాలనీ కలుపుతూ ఒక వంతెన నిర్మించబడింది. పెద్ద పెద్ద రాళ్లు కొండలనుండి , కంచర గాడిదల వీపుల మీద మోసుకు వచ్చి ఆ వంతెనను నిర్మించారు.

    వంతెన నిర్మాణం పూర్తి అయిన తరువాత అక్కడ ఒక స్తంభం మీద గ్రీకు భాషలోనూ, అరామైక్ భాషలోనూ ఇట్లా చెక్కబడింది.

    ” ఈ వంతెన ఏంటియొకస్ 2 — రాజుచే నిర్మించబడింది.”

    ప్రజలంతా ఆ వంతెన పైన నడుస్తూ అస్సీ నదిని దాటేవారు.

    ఒక రోజు సాయంత్రం —  కొంత మందిచే పిచ్చి వాడుగా భావించబడే ఒక యువకుడు, మాటలు చెక్కిన ఆ స్తంభం వద్దకు వచ్చి, బొగ్గుతో ఆ మాటలకి మసి పూసి, దానిపై ఇలా రాసాడు. “ఈ వంతెన యెక్క రాళ్లు కొండల పైనుండి కంచర గాడిదలచే తీసుకు రాబడినాయి. ఈ వంతెన పై మీరు అటూ ఇటూ ప్రయాణిస్తున్నారంటే, దాని అర్ధం — ఈ వంతెన నిర్మాతలైన ఏంటియొక్ కంచర గాడిదల వీపులపై మీరు స్వారీ చేస్తున్నారన్నమాట!”

    ఆ యువకుడు రాసిన మాటలు చదివి కొంతమంది నవ్వుకున్నారు. కొందరు ఆశ్చర్యపోయారు. మరి కొందరు ” అవును. ఇది ఎవరు రాసారో మాకు తెలుసు. అతనికి కొంత పిచ్చి ఉంది కదా?” అన్నారు.

    కానీ , ఒక కంచర గాడిద నవ్వుతూ మరో గాడిదతో ఇలా అంది. ” ఈ రాళ్లు మనం మోసుకు రావడం నీకు గుర్తు లేదా? అయినా గానీఇప్పటి దాకా, ఏంటియొకస్ రాజే దీనిని నిర్మించినట్లు చెప్పుకుంటున్నారు!”

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles