Thursday, April 25, 2024

బ్రహ్మకమలం

చాలా  రోజుల నుంచి

మా బంగ్లా మీద ఈ మొక్క

కనిపిస్తుంది

ఎన్నడూ పట్టించుకోలేదు

ప్రేమగా ఎప్పుడూ

దాని వైపు చూడలేదు

నాకేమి తెలియదు

మొగ్గలు వేసింది

ఆవిడ మురిసిపోయింది

అదేదో రాత్రి వికసిస్తుందని చెప్పింది

ఎవరి పిచ్చి వారికి అనందం అనుకున్నా….

నిన్న రాత్రి

ఏదో అలజడిగా అనిపిస్తే

పైకి వెళ్ళాను.

అప్పటికే బ్రహ్మకమలం వికసించి

వెయ్యి సూర్యోదయాలని

మా సిట్ అవుట్లో

చూపించింది

ఇల్లు మెరిసిపోయింది

మా ఆవిడ ముఖంలాగా ..

పూలకి స్త్రీలకి ఏదో తెలియని అనుబంధం

అని అనుకునే వాడిని

బ్రహ్మకమలం

నన్నూ కొంత పిచ్చివాడిని చేసింది

ఇప్పుడు

మరో కమలం ఏ అర్దరాత్రి వికసిస్తుందోనని

పన్నెండు వరకి మేల్కొనే

మరో రోజు తప్పదేమో –

పూలంటే

స్త్రీలే కాదు

పురుషులూ పరవశిస్తారేమో

పసి పాప నవ్వులా

ఈ పుష్పం

ఆ మాటకొస్తే ఏ పుష్పమైనా ..!

మల్లె మనకోసం

బ్రహ్మ కమలం బ్రహ్మకోసమేనా..?

ఎందుకంటే

తెల్లవారకముందే ముడుచుకుంటుంది

ఫ్రిడ్జ్ లో భద్రపరిస్తే తప్ప !!

Brahmakamalam flowers in the hands of a couple.
Rajender Mangari
Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles