Thursday, April 18, 2024

కత్తులు, కరవాలాలు

 వంటింటి  కత్తుల కేది కీర్తి?

ఎంత పదునైన,

ఎన్ని కూరలు తరిగిన

ఏముంది చెప్పుకునే టంత?

తెగిన ప్రతి కుత్తుక

నెత్తురుతో వ్రాసింది

ఆ నాటి విరిగిపడ్డ కరవాలాల

క్రూర చరిత్ర…

 మొండి వైనా 

మొద్దుబారిన వైనా

వాటిదే  ఘనత.

Also read: జీవన సంధ్య

Also read: ఆకాశ హర్మ్యం

Also read: బాస

Also read: సుదీర్ఘ ప్రయాణం

Also read: అట, అకటా

MAHATHI
MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles