Friday, April 19, 2024

దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం

• దుబ్బాకలో విరిసిన కమలం
• సంబురాల్లో బీజేపీ శ్రేణులు
• ఓటమిని సమీక్షించుకుంటామన్న కేటీఆర్

తెలంగాణలో తీవ్ర ఉత్కంఠను రేపిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తన సమీప పత్యర్థి టీఆర్ఎస్ కు చెందిన సోలిపేట సుజాతపై 1754 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యత ప్రదర్శించిన బీజేపీ మధ్యలో కాస్త తడబడినట్లు కనిపించినా చివరకు పుంజుకుంది. దీంతో బీజేపీ విజయంతో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి.

dubbaka bjp mla raghunandan rao

ఆద్యంతం ఉత్కంఠ

మొత్తం 23 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపు అద్యంతం తీవ్ర ఉత్కంఠను కలిగించింది. మొదటి ఐదు రౌండ్లతో పాటు 8, 9, 11, 20, 22, 23 రౌండ్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. అధికార టీఆర్ఎస్ 6, 7, 10, 13, 14, 15, 16,17,18,19 రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించింది. 12 రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య స్వల్ప ఆధిక్యమే ఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని చివరి రౌండ్ పూర్తయ్యే దాకా స్పష్టత రాలేదు. 23 వ రౌండ్ లో బీజేపీ 412 ఓట్లు ఆధిక్యం సాధించడంతో అప్పటికే 1058 ఓట్ల మెజారిటీతో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి రఘు నందన్ రావు 1470 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు.

Also Read: దుబ్బాక ఉపఎన్నిక.. ఆధిక్యంలో బీజేపీ

ఓటమిని సమీక్షించుకుంటామన్న కేటీఆర్

దుబ్బాక ఉపఎన్నిక ఓటమిపై కేటీఆర్ స్పందించారు. విజయాలకు పొంగిపోమని…అలాగే అపజయాలకు కుంగిపోమని అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ కి ఓటు వేసిన ప్రజలకు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు దుబ్బాకలో పార్టీ ఓటమిగా తనదే బాధ్యత అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తున్నానని ఓటమికి గల కారణాలను పూర్తిగా సమీక్షించుకుంటామని అన్నారు. ఓడిపోయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని హరీష్ రావు అన్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

2 COMMENTS

  1. Personally Im impressed by the quality of this. Generally when I come across these sort of things I like to post them on Digg. I dont think this would be the best to submit though. Ill look around and find another article that may work.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles