Monday, November 11, 2024

ఫ్లెమింగో-8

అక్కడ

కొమ్మ కొమ్మకో కచ్చేరి

గూటి గూటికో రాగవల్లరి

ప్రతిచెట్టూ రంగుల దొంతర

నేల పట్టంతా పక్షుల జాతర

కుహు కుహులు కిత కితలు

కువకువలు కిలకిలలు

ఎన్ని రాగ వసంతాల సంగమాలో

ఎన్నెన్ని సంబరాల దొంతరలో

వలయాక్షుల ఉల్లాసగానాలతో

వాతావరణం ఉత్పుల్ల మౌతుంది

విహాయస విద్యుత్ రహదారిలో

రంగుల కల ఆవిష్కత మౌతుంది

కాదాంబనీ శ్వేత కాంతుల వీథి

అరుణరాగాల ప్రవాహమౌతుంది

శరన్నవ రాత్రుల్లో శఫరి తీర్థం

కళల కొలువులో సేదతీరుతుంది..!

Perugu Ramakrishna
Perugu Ramakrishna
కవి పరిచయం..! 1975 లో 10 వ తరగతిలోనే తొలికవిత రాసి కవిత్వ యాత్ర మొదలెట్టిన కవి. కవిత్వమే ఊపిరిగా జాతీయ , అంతర్జాతీయ కవిగా ఎదిగిన సుపరిచితులు. వెన్నెల జలపాతం(1996) , ఫ్లెమింగో (దీర్ఘ కవిత2006), నువ్వెళ్ళిపోయాక (దీర్ఘకవిత2003), ముంజలు (మినీకవితలు2007) పూలమ్మిన ఊరు (2012) ఒకపరిమళభరిత కాంతి దీపం(2017), దూదిపింజల వాన (2020) మరియు మొత్తం 26 ప్రచురితాలు ..అంతేగాక సుమారు 200 అంతర్జాతీయ సంకలనాల్లో తన ఆంగ్ల అనువాద కవితలు నమోదు చేసుకున్న అరుదైన భారతీయ తెలుగు ప్రాంత కవి. 15 దేశాలు కవిత్వం కోసం పర్యటించి పలు విశ్వ వేదికలపై తెలుగు కవితా వాణి బలంగా వినిపించిన విశేష కవి. రంజని -కుందుర్తి ప్రధాన అవార్డ్ , ఎక్స్ రే ప్రధాన అవార్డ్ లతో మొదలెట్టి సుమారు 100 విశిష్ట అవార్డ్ లు ,2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డా వై యస్సార్ ద్వారా రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం, గ్రీస్ , జపాన్, మలేషియా, కెనడా, అమెరికా, చెక్ రిపబ్లిక్ , ఘనా, సింగపూర్, లాంటి ఎన్నో దేశాల పురస్కారాలు , తాజాగా 2019 భారత స్వాతంత్ర్య దినం సందర్భంగా గుజరాత్ సాహిత్య అకాడెమీ పురస్కారం ..లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు పొందారు. చెక్ రిపబ్లిక్ (2016) మెక్సికో (2019) లనుండి రెండు గౌరవ డి లిట్ లు అందుకున్నారు. వీరి రెండు కవితా సంపుటుల మీద రెండు విశ్వ విద్యాలయాలు ఎం.ఫిల్ డిగ్రీలు ప్రదానం చేయగా , మద్రాసు విశ్వ విద్యాలయంలో మొత్తం కవిత్వ గ్రంధాల పై పి హెచ్ డి పరిశోధన జరుగుతుంది. వీరి కవిత్వం పలు భారతీయ భాషల్లోకి స్పానిష్, ఫ్రెంచి, జపాన్, గ్రీస్, అల్బేనియా, రుమేనియా, అరబ్ లాంటి ప్రపంచ భాషల్లోకి అనువాదమై ప్రచురణ పొందింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles