Friday, March 29, 2024

బిగ్ బాస్ – 4 అభిజీత్ కైవసం

  • ఉత్కంఠగా సాగిన బిగ్ బాస్ సీజన్ 4
  • టైటిల్ పోరులో అఖిల్ ను వెనక్కి నెట్టిన అభిజీత్

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 4 పోరులో అభిజీత్ విజేతగా నిలిచాడు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలె ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి విజేత అభిజీత్ కు ట్రోఫీ, నగదు బహుమతిని అందజేశారు. ఈ సీజన్ లో ఫైనలిస్టులుగా అఖిల్, అభిజీత్, సొహైల్, అరియానా, హారికలు నిలిచారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ తుదికంటా పోరాటం చేశారు. అయితే ట్రోఫీ ఒక్కరినే వరిస్తుంది కాబట్టి హోస్ట్  నాగార్జున విజేతను ఎంపిక చేసే పనిలో భాగంగా రక రకాల పరీక్షలు పెట్టారు. ఇందులో భాగంగా ఫైనలిస్టులుగా నిలిచిన అభ్యర్థులలో తొలుత హారిక బయటకు రాగా, తరువాత అరియానా, సొహైల్ లు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఆ తర్వాత అభిజీత్, అఖిల్ ల మధ్య టైటిల్ పోరు నెలకొంది. ఇద్దరిలో విజేతగా ఎవరు నిలుస్తారన్న టెన్షన్ అందరిలో పెరిగిపోయింది. ఉత్కంఠకు తెరచించేందుకు అత్యధిక ఓట్లు సాధించి ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న అభిజీత్ ను విజేతగా ప్రకటించారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లను మైండ్ గేమ్ తో ఆడటం,  అభిజీత్ కు అభిమానులను భారీగానే  సంపాదించి పెట్టింది. దీనివల్లే టైటిల్ పోరులో ఓట్ల పరంగా అఖిల్ ను ఓడించి టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అభిజీత్ ట్రోఫీని గెలవడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి: బిగ్ బాస్ 4 విజేత ఎవరు ?

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles