Sunday, January 29, 2023

Perugu Ramakrishna

18 POSTS0 COMMENTS
కవి పరిచయం..! 1975 లో 10 వ తరగతిలోనే తొలికవిత రాసి కవిత్వ యాత్ర మొదలెట్టిన కవి. కవిత్వమే ఊపిరిగా జాతీయ , అంతర్జాతీయ కవిగా ఎదిగిన సుపరిచితులు. వెన్నెల జలపాతం(1996) , ఫ్లెమింగో (దీర్ఘ కవిత2006), నువ్వెళ్ళిపోయాక (దీర్ఘకవిత2003), ముంజలు (మినీకవితలు2007) పూలమ్మిన ఊరు (2012) ఒకపరిమళభరిత కాంతి దీపం(2017), దూదిపింజల వాన (2020) మరియు మొత్తం 26 ప్రచురితాలు ..అంతేగాక సుమారు 200 అంతర్జాతీయ సంకలనాల్లో తన ఆంగ్ల అనువాద కవితలు నమోదు చేసుకున్న అరుదైన భారతీయ తెలుగు ప్రాంత కవి. 15 దేశాలు కవిత్వం కోసం పర్యటించి పలు విశ్వ వేదికలపై తెలుగు కవితా వాణి బలంగా వినిపించిన విశేష కవి. రంజని -కుందుర్తి ప్రధాన అవార్డ్ , ఎక్స్ రే ప్రధాన అవార్డ్ లతో మొదలెట్టి సుమారు 100 విశిష్ట అవార్డ్ లు ,2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డా వై యస్సార్ ద్వారా రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం, గ్రీస్ , జపాన్, మలేషియా, కెనడా, అమెరికా, చెక్ రిపబ్లిక్ , ఘనా, సింగపూర్, లాంటి ఎన్నో దేశాల పురస్కారాలు , తాజాగా 2019 భారత స్వాతంత్ర్య దినం సందర్భంగా గుజరాత్ సాహిత్య అకాడెమీ పురస్కారం ..లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు పొందారు. చెక్ రిపబ్లిక్ (2016) మెక్సికో (2019) లనుండి రెండు గౌరవ డి లిట్ లు అందుకున్నారు. వీరి రెండు కవితా సంపుటుల మీద రెండు విశ్వ విద్యాలయాలు ఎం.ఫిల్ డిగ్రీలు ప్రదానం చేయగా , మద్రాసు విశ్వ విద్యాలయంలో మొత్తం కవిత్వ గ్రంధాల పై పి హెచ్ డి పరిశోధన జరుగుతుంది. వీరి కవిత్వం పలు భారతీయ భాషల్లోకి స్పానిష్, ఫ్రెంచి, జపాన్, గ్రీస్, అల్బేనియా, రుమేనియా, అరబ్ లాంటి ప్రపంచ భాషల్లోకి అనువాదమై ప్రచురణ పొందింది.

ఫ్లెమింగో-7

  ఆంక్షల్లేని ఆకాశం కింద అతిథి పక్షులు విశ్వసౌభ్రాతృత్వ సందేశ వాహకులు ప్రేమ ప్రబంధాలు మోసుకొచ్చిన మహాకవులు ప్రణయ రహస్యాలెరిగిన మన్మధులు సంతానవితతీ సంవేదనతో పరివార పటలి వీడివచ్చిన ప్రేమికులు విత్తంతైనా విశాల హృదయాలు వీళ్ళవి వొత్తి లేని దీపాల్లాంటివి వీళ్ళ కన్నులు వెలుగు పంచడమే...

ఫ్లెమింగో – 6

కాలం రెక్కలపై కదిలిన ఫెలికాన్లు గాలి కారులో దూసుకొచ్చిన ఫ్లెమింగోలు పతంగులై ఎగిరొచ్చిన ఎర్రకాళ్ళ కొంగలు రెపరెపలాడుతూ ఎగిరిన కొంకణాయి కెరటాల తెరచాపల పైన నల్ల కొంగలు దేశదేశాల ప్రేమ రాయబారులందరూ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నట్టు నేలపట్టు ప్రకృతంతా రంగుల ప్రేమ సందేశాలు పక్షి...

ఫ్లెమింగో-5

వలస ఒక అనాది యాత్ర వలస ఒక పురాతన జాతర జీవన నేపథ్యం రంగు మారినపుడు వలస ఒక ఆయుధం మేఘం కన్నెర్ర చేసి చినుకు కరువు చేస్తే అన్నదాత కడుపు చేత పట్టుకుని ఊరు వలసవుతుంది రైతు బతుకు కూలీ అవుతుంది వలస ఒక జాతిని...

ఫ్లెమింగో-4

అనంతమైన స్వేచ్చకు రెక్కలు మొలిస్తే పక్షి ఒక బెదురును ఒక అదురును కళ్ళనిండా నింపుకుని సరిహద్దు సైనికుడిలా అనుక్షణం అప్రమత్తమై అన్వేషణే చూపై చూసేది పక్షి రెక్కల కొసలకి తోకల మొనలకి అందమైన కలనేత రంగులు అద్దుకునేది పక్షి ఒక జెట్ వేగాన్ని ఒక వాయు సోయగాన్ని వలేసి పట్టుకునేది పక్షి కడుపు కాలిన...

ఫ్లెమింగో-3

ప్రతి చలనం ప్రయాణమే ప్రతి హననం ప్రయాణమే ప్రతి జననం ప్రయాణమే ప్రయాణమే వలస పక్షుల జిగీష సంతానమే అనురాగ సాగర ప్రయాస కెరటాల కాళ్ళతో కడలి పరుగెత్తినట్టు తెరలు తెరలుగా గాలి ప్రవహించినట్టు ఊపిరూపిరులుగా  జీవితం సాగిపోయినట్టు వార్తలు వార్తలుగా ప్రపంచం తిరుగుతున్నట్టు రెక్కలు రెక్కలుగా ఎగిరొస్తాయి పక్షులు దాంపత్య జీవన పరీప్సలో...

ఫ్లెమింగో-2

ప్రయాణం ఒక చలన లక్షణం ప్రవాహం ఒక చైతన్య ఆవరణం పువ్వు ప్రయాణిస్తుంది పరాగమై పువ్వు నుంచి పువ్వు వరకు అనురాగమై పక్షి ప్రయాణిస్తుంది సరాగమై తీరం నుంచి తీరం వరకు పరంపరాగమై సంతానకాంక్ష మాతృధర్మం సంతాన కాంక్షే ఆత్మ వ్యాప్తి మర్మం సృష్టి కార్యం ఒక్క మనిషికేనా వర్తిస్తుంది సృష్టి న్యాయం సమిష్టిలో సమానంగానే వర్ధిల్లుతుంది ఎన్ని చినుకులైతే ఒక...

ఫ్లెమింగో-1

‘ఫ్లెమింగో’ పెరుగు రామకృష్ణగారి దీర్ఘ కవిత. ఇది 2006లో విడుదలై 15 యేళ్ళు పూర్తయింది. ఇప్పటివరకు ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడం, మళయాళం లాంటి భారతీయ భాషల్లోకి రొమేనియ ప్రపంచ భాషలోకి అనువాదమై ప్రచురణ అయింది. దీన్ని...

కొత్త సిలబస్

కొత్త సిలబస్ ఏడ్చినా నవ్వినట్టే ఏడ్వు కన్నీటికి కరిగే గుండెల్లేని ఎడారిలో కోకిల పాటకి శ్రోత వుండడు.. మాట్లాడినా, మాట్లాడనట్టే ..మాట్లాడు వంచనాలంకారమే ముఖారవిందమైన అద్దం ముందు స్వచ్ఛతకి ప్రతిబింబం వుండదు.. రెండు పెగ్గుల ఆలింగనాల మధ్య కరచాలనం చేస్తూ పెదవులు పూలు పూయటం స్నేహ రుతువుకు సంకేతం...
- Advertisement -

Latest Articles