Saturday, June 25, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

239 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

“జీవిత సాఫల్య పురస్కారం”

జీవితం ఓ ఆట చిన్నప్పుడు కాస్త ఊహ తెలిసేప్పటికి స్నేహమేరా జీవితం యవ్వన ప్రాంగణంలో గిర్రున తిరిగే రంగుల రాట్నం కాస్త నిలదొక్కుకోగానే సంపాదన పర్వం పోటీ, ప్రావీణ్యం, పదవి పక్కన ఓ తోడు జత కావడం పిల్లలు, చదువులు, పెళ్లిళ్లు బరువులు, బాధ్యతలు నొప్పులు, రోగాలు,...

“పూజా ఫలం”

యజ్ఞ యాగాదులు పూజలు వ్రతాలు తీర్ధయాత్రలు, పవిత్ర జలాల మునకలు  దాన ధర్మాలు గుళ్ళో ప్రదక్షిణలు సహస్రనామార్చనలు తప్పించ లేవు కర్మ ఫలాన్ని మంచిలేని నీ చెడు బతుకుని. నడక ఆరోగ్యం కపటం లేని నడత మహా భాగ్యం అదే నిజమైన పూజ అదే...

“సంక్రాంతి”

పాతదంతా భోగి మంటల్లో ఆహుతి చేసే కాలం ధాన్యం ఇంటికి వచ్చే కాలం సౌభాగ్యం వెల్లివిరిసే కాలం పశుసంపదను పూజించే కాలం రుతువులోని జడత్వం తగ్గి నవ చైతన్యం పెరిగే కాలం రోగ కారకాలు నశించి ఆరోగ్యం వికసించే కాలం ఆనందంగా పండగ...

“రాజ్యాంగం”

బాబూ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో మహామహులు మూడు వందలమంది మూడు సంవత్సరాల మేధో మధనంతో విద్వన్మణి అంబేడ్కర్ కమిటీ అక్షరీకరణతో రూపం దాల్చిన భారత రాజ్యాంగం ధర్మో రక్షతి రక్షిత ప్రతిరూపం మాననీయం, గౌరవార్హం. న్యాయం, స్వేచ్ఛ,...

“ఏది నిజం”

డార్విన్, అరబిందో పరిణామం అన్నాడు డార్విన్ సూపర్ మ్యాన్ అన్నాడు బెర్నార్డ్ షా దివ్య పురుషుడు అన్నాడు అరవిందుడు ఈ శరీరం ఆ భవ్య జీవనానికి పనికి రాదంటాడు డాక్టర్ హెగ్డె. అబద్దం రాజ్యమేలుతోంది మోసాలు, మానభంగాలు పెరుగుతున్నాయ్ దయ, మమత,...

“దొంగ”

ఇంటింటా దాచిన వెన్న దోచిన దొంగ. మేనమామ ప్రాణం హరించాడు మాతా పితరుల విముక్తికి. గోవర్ధనగిరి నెత్తాడు గోవుల రక్షించి ఇంద్రుడి గర్వాన్ని హరించేందుకు. కాళీయుడిని మర్ధించాడు మడుగులో విషాన్ని హరించేందుకు. గోపెమ్మల మనసులు కొల్లగొట్టాడు, బట్టలు ఎత్తుకెళ్ళాడు వారి అజ్ఞానాన్ని హరించాడు. రుక్మిణిని ఎత్తుకెళ్లాడు. భామ...

‘‘శార్వరి”

శార్వరినామ సంవత్సరం వచ్చింది  రాలిన ఆకుల స్థానంలో సరికొత్తవి మొలుస్తున్నాయ్ పరిసరాలన్నీ కొత్తదనం పులుముకుంటున్నాయ్ కోయిల కూతలు కమ్మగా వినబడుతున్నాయ్ ఎండలు చురుక్కుమంటున్నాయ్ లోపల బయట మాంద్యం వదలి చురుకుదనం పడగ విప్పుతూంది నివురు కప్పిన ఆశల నెగళ్లు మళ్ళీ రాజుకుంటున్నాయ్. ఇంతలో...

“సామరస్యం”

భగవాన్ మాకు ప్రేమించే హృదయాన్నిచ్చావు అయినా కుల, మత, ప్రాంత, భాషా భేదాలతో  తిట్టుకుంటూ చంపుకుంటూ బ్రతుకుతున్నాం. స్వార్ధంతో పసి మనసుల్లో కూడా విష బీజాలు నాటి ద్వేషం పూలు పూయిస్తున్నాం అమాయకులను, పిల్లల్ని, ఆడవాళ్లను...
- Advertisement -

Latest Articles