Thursday, December 8, 2022

MAHATHI

78 POSTS0 COMMENTS
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

కూలి

ఎనభై దాటినా అతను ఇంకా కూలియే... వరి నాట్లు, కాల్వల పూడికలు, కుప్ప నూర్పులు, వీపు పై మోయలేనంత బరువు తప్పని జీవితం. మెత్తపడి, వాలిపోయి, బిగుతు తగ్గిన అతని కండలు ఇంకా లయ తప్ప కుండా, అలుపు...

ప్రళయం

వినీలాకాశాము వ్రక్కలై వీధిలో తచ్చాడుతోంది. శూన్యం లో మట్టిమరకలు. వికృత మకరాలు మరిచికా జలధిలో విహారం చేస్తున్నాయి. రంభను రాతిపై తోసి అనుభవించిన రావణుడు వికటాట్టహాసం చేస్తున్నాడు. కురుసభలో కురులు విరబోసికొని  మగ జాతి వినాశనానికి శపధం చేస్తున్న  ద్రౌపది. ఆపిల్ కోసం పరుగెడుతున్న ఆడమ్ వెర్రి...

నీకు దగ్గరగా

అక్కడ నీవు ఇక్కడ నేనైనా ఎప్పుడు నీవు నాకు దగ్గరే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ నీ శరీర సహజ సుగంధం, నన్ను వెచ్చగా తాకుతూ నీ ఊపిరి, చేరువగా,  మరింత చేరువగ మెత్తగా హత్తుకొంటున్న నీ సుకుమార  స్పర్శ...

జ్ఞాపకాలు

కాలం నివురు క్రింద భగభగ మండుతున్న జ్ఞాపకాలు. ఒక్క శిథిల క్షణం నుంచి  ప్రాణం పోసుకున్న ఒక  మృత స్మృతి  క్రూర ప్రభంజనమై వీస్తుంది. రేగిపోయిన భస్మ రేణువుల వెనుక నుండి రెండు అగ్ని బాష్పాలు... అదేమో గతించిన వసంత కుసుమాల సుగంధం...

కర్మ ఫలం

ఎప్పుడు ఏ చెట్టు కొట్టిన పాపమో, భూమి తల్లి గుండెలు చీల్చి చమురు అపహరించినప్పటి శాపమో, సాగర ప్రియుని చేర  సాగిపోతున్న నదీ కన్యకు కాలడ్డు పెట్టిన  ప్రతిఫలమో... స్వచ్ఛమైన ఆకాశాన్ని నల్లని విషపు పొగలతో నింపిన పొగరు మనిషి పై ప్రకృతి...

నిశ్శబ్ద గీతిక

కొన్ని ముఖాలు మాయమయ్యాయి ,  కొన్ని నిర్జీవ  నిశ్చలతతో బ్రతికే ఉన్నాయి. కొన్ని రక్తారుణ దుఃఖాన్ని పులుముకున్నాయి. కాలం చరిత్రకు కొన్ని కొత్త పుటలను కలుపుతూ పాపప్రక్షాళనకు వాన రావాలని వేచివుంది. విషం మింగిన నింగి నెలల తరబడి...
- Advertisement -

Latest Articles