Wednesday, August 17, 2022

Dr N.Gopi

34 POSTS0 COMMENTS
ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ కులపతి

ముంబయిలో వర్షం

బాంబేగా కులికినప్పుడూ ముంబయిగా వెలుగుతున్నప్పుడూ ఇక్కడి వర్షానికి క్యా ఫరక్ పడ్‌తా హై! మెరీన్‌డ్రైవ్‌లో ఈడ్చి కొట్టే ఉప్పెన జల ఫణ గణాగ్రంలా అందంగా వుంటుంది గాని అనుభవమే విష ఫూత్కార సంచలితం. ఆనాటి శ్రీ 420 సినిమాలోని నర్గీస్, రాజ్ కపూర్‌లు ఇప్పుడు ఏ చెట్టు నీడన దాక్కున్నారో! ఎగిరి...

అంశిక

దారి వెంట ఓ రోజు నడుచుకుంటూ వెళ్తున్నాను. చిత్రమైన ఆలోచన వచ్చింది ఈ క్షణంలో లోకంలో కోట్లాది మంది వున్నారు కదా వారితో పరిచయం కాకుండానే నా జీవితం తెల్లారి పోతుందే అని. ఇంత చిన్నదా జీవితం! చుట్టూ వున్న ఒకరిద్దరి తోనే సమాప్త మౌతుందా! ఇన్నాళ్లూ భూగోళం...

గాలి

పొద్దటి నుంచి గాలి లేదు, నిన్నటి గాలి తోనే సరి పెట్టు కుంటున్నాము. తాజా వాయువులు వస్తూ వస్తూ ఎక్కడో ఆగి పోయినట్టున్నాయి. పువ్వులన్నీ ఒక్క చోట చేరి ముచ్చట్లాడు కుంటున్నాయి. గాలి వీస్తే గదా పరిమళాలు నలువైపులకు పయనించేది. ఆ మొన్న తుఫానుకు చెట్లు చెలరేగి పోవటం గుర్తుంది. ఇవాళ కొమ్మయినా ఊగటం...

గొడుగు

అంత పెద్ద ఆకాశాన్నీ ఇంత గుడ్డ పేలిక ధిక్కరించింది. భుజం మీద విష్ణు చక్రంలా తిరుగుతుంటే మేఘాలు గుబగుబలాడాయి ధైర్యమంటే గొడుగుదే. మూడు రోజులుగా ఒకటే వర్షం! కిటికీల్లోంచి తిలకించే వారికి బర్‌ఖా బహారే గరీబోళ్లకు మాత్రం ఆమె పాల కోసం బయల్దేరింది తన హృదయ స్పందనలు గొడుగు పుల్లపుల్లకూ తెలుస్తున్నాయి. భళ్లున...

మా ఊరు

నేనెక్కడుంటే అదే మా ఊరు. ఉన్న ఊరు అలవాటయ్యిందని కాదు సొంతూరును ఇక్కడిని తెచ్చుకున్నానని. జీవితమంతా పోలికల్తోనే గడుస్తుంది. ఇక్కడ ఎన్ని ఎత్తుల కెదిగినా మా గుట్ట కన్న పొట్టిగానే వున్నాయి. మా వాకిట్లో సిమెంటు తాపడం చేయించ లేదు సానిపి చల్లక పోతే జీవన పరిమళాలకు దూరమౌతామని. మా బస్తాలో బియ్యపు గింజలు ఏదో...

ఆకు

ఆ చెట్టు బహుళ పత్ర హరిత మనోహరం. అట్లా నాకు పరిచయ మయ్యింది ఒక ఆకు. దానిపై రాలిన చినుకు మెరిసే ముత్యాల తళుకు. లయాత్మకంగా కదులుతూ గాలిని సంతోష పెట్టే వీవన. రెపరెపలాడుతూ పక్షి రెక్కలను ఉత్సాహ పరిచే దీవెన. ప్రతి రోజూ నన్ను చూడగానే నిగనిగలాడుతూ ప్రేమగా...

తాళం చెవి

‘తాళం చెవి పోయిందిరా’ అంటూ ఇంటి అరుగు మీద కూల బడ్డాడు బాల్య మిత్రుడు. ‘ఇప్పుడు తాళం చెవి మీద కవిత్వం చెప్పు చూద్దాం’ అన్నాడు. ‘పోగొట్టు కుంటే తెలిసిందా విలువ’ అంటూ గొంతు సవరించుకొని రాసుకొమ్మన్నాను. ‘తాళం చెవి ఒక లోహం ముక్క. దాన్నితాళంలో...

సాక్షి

ఆ యింటి ముందుకు రాగానే రోడ్డు ఓ క్షణం వినమ్రంగా ఆగి చూస్తుంది. అక్కడున్నది హోదాలు వెలిగించిన సెలెబ్రిటీ అని కాదు. ఆ ప్రదేశం అపురూప పుష్పాల గంధకుటి అనీ కాదు. బాల్కనీలో ఒక మూలన ఎప్పుడూ ఆసీనుడై ఉండే అతి సామాన్యుడు. కింద వీధిలో వచ్చి పొయ్యే...
- Advertisement -

Latest Articles