Thursday, April 25, 2024

టీ 20లో ఆస్ట్రేలియా సంచలన విజయం

మాథ్యూ వేడ్

  • చివరి ఘడియల్లో పాకిస్తాన్ పరాజయం, ఇదే మొదటి ఓటమి
  • అద్భుతంగా మూడు వరుస సిక్సర్లతో అదరగొట్టిన మాథ్యూ వేడ్
  • ఆదివారం రాత్రి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఫైనల్

పాకిస్తాన్ క్రికెట్ జట్టు చివరివరకూ బాగా ఆడి ఫైనల్ లో ప్రవేశించలేకపోయింది. ఆస్ట్రేలియా ఓడిపోతుందని అందరూ అనుకున్న సమయంలో అయిదో వికెట్ జోడీ విజృంభించి ఆడి గెలిచారు. 177 పరుగులు చేయవలసి ఉన్న ఆస్ట్రేలియా అయిదు వికెట్ల నష్టానికి 19పరుగులలో లక్ష్యం ఛేదించింది. అయిదు వికెట్ల వ్యత్యాసంతో పాకిస్తాన్ పైన విజయం సాధించింది. మాథ్యూ వేడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి లక్ష్యాన్ని అధిగమించాడు. ఎవ్వరూ ఊహించని విధంగా పాకిస్తాన్ చివరి క్షణంలో పరాజయం పొందింది. మార్కస్ స్టోయినిక్స్ , మాథ్యూ వేడ్ 81  పరుగుల భాగస్వామ్యం సాధించి అజేయంగా మిగిలారు. ఆదివారంనాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా తలబడుతుంది.

పాకిస్తాన్ పేసే బౌలర్లు బౌల్ చేస్తుండగా స్టాయినిస్, వేడ్ లు రిస్కు తీసుకొని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. వేడ్ మూడు వరుస సిక్స్ లు కొట్టాడు. షహీన్ ఫా అఫ్రిదీ బౌలింగ్ లో మూడు సిక్స్ లు బాదడం మామూలు విషయం కాదు. 177 పరుగుల లక్ష్యన్ని ఛేదించేందుకు రంగంలో దిగిన ఆస్ట్రేలియా జట్టు ఒక్క పరుగు కూడా చేయకుండా కెప్టెన్ ఆరొన్ ఫించ్ పెవెలియన్ దారి పట్టాడు. కెప్టెన్ వికెట్టు తీసుకున్న పేసర్ షహీన్ షా అఫ్రదీనే. స్పిన్నర్ షాబాద్ ఖాన్ నాలుగు కీలకమైన వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. ఆ దశలో పాకిస్తాన్ విజయం ఖాయమనే అందరూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియన్ మిడిల్ ఆర్డర్ అద్భుతంగా తమ ఇన్నింగ్స్ ను నిర్మించుకుంటూ వచ్చింది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా పాకిస్తాన్ ను బ్యాటింగ్ చేయమని పంపింది. నాలుగు వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 176 పరుగులు తీశారు.  ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 67 పరుగులు చేసి రాణించాడు. కెప్టెన్ బాబర్ 37 పరుగులు చేశాడు. ఫకర్ జమాన్ 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రిజ్వాన్ ఒక కేలండర్ సంవత్సరంలో వేయి పరుగులు సాధించిన మొదటి బ్యాట్స్ మన్ గా రికార్డు నమోదు చేశాడు. మరో సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచింది. ఫైనల్ న్యూజిలాండ్ కీ, ఆస్ట్రేలియాకీ మధ్య ఆదివారం జరుగుతుంది.

వేడ్ క్యాచ్ ను డ్రాప్ చేసిన హసన్ అలీని నిందించడానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిరాకరించాడు. ‘‘ఆయన మా మెయిన్ బౌలర్. చాలా సందర్భాలలో పాకిస్తాన్ కు విజయం తెచ్చిపెట్టాడు. ఆటగాళ్ళు క్యాచ్ లు డ్రాప్ చేస్తారు. అది సహజం. హసన్ అలీ పోరాటశీలి. మళ్ళీ వెనక్కి వస్తాడు. ప్రతి ఆటగాడూ ప్రతి రోజూ రాణించడు. కొన్ని రోజుల్లో అద్భుతంగా ఆడతారు. ఈ రోజు అతడిది కాదు. అంతే. అతడు బాధపడుతున్నాడు. మళ్లీ పుంజుకుంటాడు. ప్రజలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. మేము మాత్రం ఆడుతూనే ఉంటాం,’’ అని వ్యాఖ్యానించాడు బాబర్. వికెట్ కీపర్ – బ్యాటర్ అయిన ఆస్ట్రేలియా యోధుడు వేడ్ కూడా తాను ఇచ్చిన క్యాచ్ ను నేలపాలు చేయడం అన్నది విశేషమేమీ కాదనీ, అప్పటికే ఆస్ట్రేలియా మంచి స్థితిలోకి వచ్చేసిందనీ అన్నారు. ‘‘క్యాచ్ ఇచ్చిన సమయానికి ఆస్ట్రేలియా టీమ్ కు 14 పరుగులు అవసరం. ఆ పరుగులు సాధించడం ఎవరికైనా అసాధ్యం కాదు. అప్పటికే ఆట మాకు అనుకూలంగా మారింది,’’ అని అన్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles