Sunday, June 26, 2022

వచ్చేనెల 5వ తేదీ వరకు తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు

  • ఎనిమిది రోజుల పాటు సమావేశాలు
  • శని, ఆదివారాలతో పాటు అక్టోబర్ 2,3 తేదీల్లో సమావేశాలుండవు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమ‌య్యాయి. ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశాలు ప్రారంభమవగా.. స‌భ‌లో స్పీక‌ర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంతాప తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టారు.  అనంత‌రం స‌భ‌ను వాయిదా వేశారు. స‌భ వాయిదా.. త‌ర్వాత బీఏసీ స‌మావేశం జ‌రిగింది.  ఈ స‌మావేశంలో స‌భ‌లో చ‌ర్చించే అంశాల‌పై నిర్ణ‌యం తీసుకోగా… స‌భ‌లో చ‌ర్చించాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయ‌ని, త‌ప్ప‌నిస‌రిగా 20 రోజుల పాటు జరిగే స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.  అయితే, అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌భుత్వం షెడ్యూల్ చేసింది. స‌మావేశాలు 10 రోజులు పాటు నిర్వ‌హించ‌డం వ‌ల‌న అన్ని అంశాల‌పై చ‌ర్చించ‌డానికి కుద‌రద‌ని, కావాల‌నే ప్ర‌భుత్వం అసెంబ్లీ సమావేశాల‌ను త‌క్కువ రోజులు నిర్వ‌హిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles