Tuesday, November 12, 2024

అర్ధనారీశ్వరం

పురుషాధిక్య సమాజం పొగరు

సాంఘీక దురాచార సంకెళ్ళు

వదిలించుకున్న స్త్రీ

స్వేచ్ఛా వాయువు పీల్చగానే

ఆర్ధిక స్వాతంత్ర్యం పురులు విప్పి

స్త్రీ ఇష్టారాజ్య కుటుంబ వ్యవస్థ

వేళ్లు విస్తరించుకుంటూంది.

మంచి చెడు ఆలోచించని

ఆధిపత్య ధోరణి అనర్ధదాయకం

బతుకు బండి రెండు చక్రాల్లో

ఏది గాడి తప్పినా

జీవితం గతి తప్పుతుంది.

అర్ధనారీశ్వరుడే ఆరాధ్యం

అప్పుడే నవజీవన వికాసం

అదే స్త్రీ పురుషులిద్దరికీ ఆదర్శం.

Also read: కవితోత్సవం

Also read: తెల్ల జండా

Also read: నవ్వుల వీణ

Also read: మరో వసంతం

Also read: కామ దహనం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles