Friday, March 29, 2024

రోజుకు మూడుసార్లు హాజరు వేయాల్సిందే!

ఏపీ ప్రభుత్వ సరికొత్త  నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం – ప్రజల మధ్య వారధిగా సచివాలయ వ్యవస్థ పని చేస్తోందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు ఆ సచివాలయాల్లో పని చేసే ఉద్యోగుల విషయంలో కొత్త హాజరు నిబంధన తీసుకొచ్చింది. ఏ ఇతర ప్రభుత్వశాఖల్లోనూ లేనివిధంగా రోజులో మూడుసార్లు హాజరు తప్పనిసరి చేసే కొత్త విధానం సచివాలయాల్లో ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. రోజులో మూడుసార్లు హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ను ఉద్యోగులు తమ స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకొని చేసుకోవాలి. రోజూ మూడు సార్లు హాజరు వేసుకోవాలి.

ఇందు కోసం మూడు సమయాలను నిర్దేశించింది. ఉదయం 10 గంటల్లోపు, మధ్యాహ్నం 3కు, సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. సొంత ఫోన్లు లేనివారు సచివాలయాలకు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్‌ ఫోన్లను ఉపయోగించుకోవాలని సూచించింది.

ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు తమ ప్రొబేషన్ ఖరారు పైన ప్రభుత్వం ఇచ్చిన హామీ పైన ఆశగా ఎదురు చూస్తున్నారు. 2019 అక్టోబరులో విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ 2021 అక్టోబరులో ఖరారు చేయాలి. శాఖాపరమైన పరీక్షల్లో చాలామంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశంతో 2022 జూన్‌లో అందరి ప్రొబేషన్‌ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles