Tuesday, September 26, 2023

పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే : బీజేపీ

పోలవరం  విషయంలో తమ పార్టీపై  అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,   ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని   బీజేపే ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ, శాసన మండలిలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి  వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయ్యిందని అన్నారు. బుధవారం నాడు  పార్టీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులుగా  బి. శ్రీరామ్ ప్రమాణస్వీకార   కార్యక్ర మంలో ఆయన పాల్గొంటూ, రాష్ట్రంలో  కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. నంద్యాల సలాం కుటుంబం ఆత్మహత్య అంశంపై కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండి పడ్డారు వైసీపీ పార్టీలో తల్లి, చెల్లి, తన కుటుంబ సభ్యులతో పార్టీ, ప్రభుత్వాన్ని జగన్ నడిపిస్తున్నారని విమర్శించారు. బీజేపీ  కుటుంబ, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles