Wednesday, April 24, 2024

పుష్ప వేదన

అప్పుడప్పుడే విచ్చుకుంటున్న చిన్ని గులాబీ  లో

గుబాళించిన ఒక జీవితేచ్చ…

పలుచటి గులాబీ రంగు మొగ్గ నుండి పెరిగి

ఎర్ర ఎర్రని రెక్కలుగా వికసించిన

విచిత్ర మైన కోరిక…

తనను పెంచిన కొమ్మను వీడి పోవాలని.

సంధ్యా సమీరాలను నిరసించింది

ప్రేమార్థులై మూగిన భ్రమరాల

వైపు పెడ ముఖం పెట్టింది.

రాత్రి ఝాములు గడిచే కొద్దీ

అసురుసురంటూ నిట్టూర్పుల సెగలు కక్కింది.

గుబులుగా,  కోపంగా,  ఆతృత గా,  అసహనం గా 

కాసేపు తనలో తను ఎదో స్మరించుకుంటూ

అటూ ఇటూ ఊగిపోతూ

 నిశ్శబ్ద తపస్సు లో నిశ్చల యోగిలా స్తంభించి మరి కాసేపు

ఆ నిశీధి వేళ వ్యగ్ర నిరీక్షణ లో

తమస్సు ఆవరించిన  తాత్విక తేజస్సులా…

ఆ కుసుమ యోగిని…

తోటపై పరచుకున్న తొలి కిరణాల కాంతిలో

కలియ చూసింది.

అదిగో… ఆమె రానే వచ్చింది పూల సజ్జతో…

ఒక్కొక్క మొక్కను పలుకరిస్తూ,

గోరాన్చక తొడిమెలు తుంచుతూ

తనవద్దకే వస్తోంది… తన వంతు వస్తుందా?

అదిగో దగ్గరకు వచ్చింది… నా వైపే చేయి చాచుతోంది…

ఎన్ని సుదీర్ఘ  వ్యర్ధ జన్మల దాట గ  వచ్చే

ఈ అల్పాయుర్దాయ సఫల జన్మ

 ఇదిగో నా మహా ప్రస్థానం ప్రారంభం కాబోతున్నది

గుడిలో దేవుని పాదాల చెంతకు…

ఇదే జనన మరణ చక్రభ్రమణం నుండి

వేరుపడి కొత్త రెక్కలతో ముక్తి మార్గం వైపు

ఎగిరిపోయే తరుణం.

నా వేల జన్మల నిరీక్షణ ఫలం,  నా పూర్వ జన్మ కర్మ బలం

ఇది నా నిర్యాణ సమయం, ఇది   నా నిర్వాణ క్షణం.

Also read: తపస్సు

Also read: యుగసంధి

Also read: విజేతలు

Also read: పూలవాడు

Also read: రాగాలు

MAHATHI
MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles