Thursday, April 25, 2024

ఆంధ్రభూమి

రాజు కొడుకు రాజే కావాలి

దానికోసమే రాజకీయం రాజుకోవాలి

మర్రి నీడలో మరో మొక్క కి మనుగడ లేదు !

మిధ్యా ఊహలతో మొదలెడతాడు

మధ్యలో వెండి తెరపై వెలుగుతాడు

ఎప్పటికి నాయకుడిగా తేలతాడు?

కటకంతో కాంచినా కానరాదు అభివృద్ది

బడ్జెట్ లో లేదు కేంద్రానికి పెట్టుబుద్ది

రాజోలిబండ రైతుల వెతలు నిత్య వృద్ది

పోలవరం ఒక కలవరం

రైతు కలల కల్లోల సాగరం !

పధకాలతో ప్రసిద్ది

ఫ్యాక్షన్ యాక్షన్ లు సమృద్ధి

వడ్డి పై వడ్డి మనకు దొరికే సిద్ది

విడి పోయి

ఓడి పోయిన శ్రీరాముల త్యాగభూమి

నిత్య వేదనల కర్మ భూమి

ఇది ఆంధ్ర భూమి

– వీరేశ్వర రావు మూల

Also read: డైన్ మైట్

Also read: భ్రమరావతి

వీరేశ్వర రావు మూల
వీరేశ్వర రావు మూల
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles